Begin typing your search above and press return to search.

బొత్సా... సూప‌ర్ ఆఫ‌ర్‌

By:  Tupaki Desk   |   27 Aug 2015 4:31 PM GMT
బొత్సా... సూప‌ర్ ఆఫ‌ర్‌
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు ప్ర‌త్యేక హోదా కోసం వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఈనెల 29న‌ చేప‌ట్టిన బంద్‌ ను విజ‌య‌వంతం చేసేందుకు ఆ పార్టీ నాయ‌కులు శ‌త‌విధాలా కృషి చేస్తున్నారు. ఈ క్ర‌మంలో పార్టీ నేత‌లు రాష్ర్ట‌వ్యాప్తంగా స‌భ‌లు, స‌మావేశాలు పెడుతూ పార్టీ శ్రేణుల‌ను ఉత్సాహ‌ప‌రుస్తున్నారు. ఈ క్ర‌మంలో విశాఖ‌ప‌ట్ట‌ణంలో విలేక‌రుల స‌మావేశం ఏర్పాటుచేశారు. ఈ క్ర‌మంలో బొత్సా స‌త్యానార‌య‌ణ‌ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

పార్టీ బలోపేతం కోసమో..అధికారం కోసమో తాము ఈనెల 29న ఏపీ బంద్ కు పిలుపునివ్వ‌లేద‌ని.....ఏపీకి ప్రత్యేక హోదా కోసమే ఆ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రత్యేక హోదా రాష్ర్టానికి సంజీవని అని బొత్స అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే బలిదానాలు జరుగుతున్నాయని, ఇది మంచి ప‌రినామం కాద‌ని బొత్స‌ ఆవేదన వ్యక్తం చేశారు.

రాఖీ రోజు బంద్ ను రాష్ర్టం కోసం రక్షాబంధన్ దినోత్సవంగా భావించాలని బొత్స పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేరే వరకు పోరాడుతామన్నారు. నయవంచన, మోసాలకు టీడీపీ పెట్టింది పేరని అన్నారు. అందుకే ఆ పార్టీ విధానాన్ని గ‌మ‌నించి వామపక్షాలు కూడా బంద్ కు మద్దతిచ్చినట్టు తెలిపారు. బస్సులను ధ్వంసం చేయాలని ఎవరన్నారో తెలియదని, బంద్‌ సందర్భంగా విధ్వంసాలకు తావు లేదని బొత్స వివరించారు.​