Begin typing your search above and press return to search.
నా సవాల్ కు స్పందించే దమ్ముందా బాబు?
By: Tupaki Desk | 29 Dec 2016 4:57 AM GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే 12.23 శాతం వృద్ధి సాధించామని సీఎం చంద్రబాబునాయుడు - ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కాకిలెక్కలు చెబుతున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. తప్పుడు లెక్కలతో ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. హెచ్చరించారు. జీడీపీ - అభివృద్ధిపై చంద్రబాబు ప్రభుత్వం చెప్పే లెక్కలన్నీ వాస్తవ దూరాలని సోసియో ఎకనమిక్ సర్వే ఆధారంగా ఆయన నిరూపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బొత్స విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.... మీరు చెప్పుకునే అభివృద్ధిపై ప్రభుత్వం తరఫున అధికారులను ఎవరినైనా చర్చకు పంపాలని సవాల్ విసిరారు. అభివృద్ధి-జీడీపీ-ఆర్థిక శాస్త్రం గురించి మీకేం తెలుసని ప్రశ్నించే మీరు చర్చకు వచ్చే దమ్ముందా అని బొత్స నిలదీశారు.
వృద్ధిలో పురోగతి నమోదైతే రెవెన్యూలో కనిపిస్తుందని బొత్స సత్యనారాయణ వివరించారు. నిరుడు రెవెన్యూ వృద్ధి చూస్తే 25.9 శాతమని - 7.3 శాతం జీడీపీగా నమోదైందన్నారు. రెవెన్యూ ట్రెజరీలోకి వస్తుందని, ట్రెజరీలో డిపాజిట్ అవుతాయన్నారు. పదిశాతం కంటే ఒక్కశాతం కూడా రెవెన్యూ వృద్ధి కాలేదన్నారు. ప్రతినెలా వచ్చిన రెవెన్యూ ఆదాయాన్ని ప్రజల ముందు ఉంచాలని బొత్స కోరారు. రాష్ట్రంలో రబీ పంట రెండేళ్లుగా తగ్గిపోతుందని, దీనికి కారణాలను వివరించాలన్నారు. 2014-15లో 13 లక్షల హెక్టార్లు - 2015-16లో 12 లక్షల హెక్టార్లు - 2016-17లో 9.21 లక్షల హెక్టార్లలో రబీ పంట విస్తీర్ణం తగ్గిందన్నారు. వ్యవసాయం - పరిశ్రమలు - ఉపాధి రంగాల్లో ఒక్క శాతం కూడా వృద్ధి నమోదు కాలేదన్నారున. అంకెలను తారుమారు చేసి చెబుతున్నారని బొత్స మండిపడ్డారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఏఏ పరిశ్రమలు వచ్చాయో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. పారిశ్రామిక, తయారీ రంగంలో 8.52 శాతం వృద్ధి రేటు నమోదైందని, 99 వేల కోట్ల పెట్టుబడులతో 456 సంస్ధలు నెలకొల్పినట్లు చెప్పారని, ఇవన్నీ కాగితాలకే పరిమితమని బొత్స అన్నారు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలే మూతపడుతుంటే, కొత్త పరిశ్రమలు ఎక్కడున్నాయో చెప్పాలన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక్కరికి కూడా ఇల్లు కట్టించలేదని, దీంతో ఆ రంగంలో స్తబ్ధత నెలకొని ఉందన్నారు.
చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నంతకాలం నానా హడావుడి చేసి ఉన్నదానికి లేనిదానికి అంతెత్తున ఎగిరిపడి పోయేవాడని బొత్స ఆరోపించారు. కానీ నేడు ప్రతిపక్షం ఉన్న లెక్కలను ఎత్తి చూపితే సమాధానం చెప్పుకోలేక ప్రతిపక్షాల గొంతు నొక్కాలని ప్రయత్నించడం దారుణమన్నారు. ''కాకి లెక్కలతో ఎంతోకాలం ప్రజలను మోసం చేయలేరన్నారు. ఆనాడు ఇళ్లు కట్టిస్తే అడ్డుకోవాలని చూశావ్.. పేర్లు పెట్టావ్.., ఆరోగ్యశ్రీతో పేదవారికి వైద్యం చేయిస్తుంటే ప్రభుత్వ వైద్య శాలల గతేంకావాలని మొసలి కన్నీరు కార్చావ్.. ఉచిత విద్యుత్ ఇస్తే ఇప్పుడు నువ్ ఛార్జీలు పెంచావ్.. జలయజ్ఞంతో పొలాలకు నీళ్లిస్తుంటే ధనయజ్ఞం అని ప్రచారం చేశావ్.., ఫీజు రీయింబర్స్ మెంట్ తో పిల్లలను చదివిస్తే ఓర్చుకోలేకపోయావ్.., ఇన్ని చేసి ఇప్పుడు వాస్తవాలను మాట్లాడే ప్రతిపక్షంపై నిందలు వేయాలని చూడటం చంద్రబాబు చేతకానితనానికి నిదర్శనం'' అని బొత్స ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు ముందుకు కదిలిందంటే అందుకు కేంద్రప్రభుత్వం ఇచ్చిన నిధులే కారణమన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పోలవరం కుడికాల్వ నిర్మాణం చేయకపోతే పట్టిసీమ ఎక్కడుండేదని బొత్స ప్రశ్నించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/