Begin typing your search above and press return to search.
ఆ మాటతో ఆంధ్రోళ్లే కాదు తెలంగాణ వారు కూడా మునిగిపోతారా?
By: Tupaki Desk | 21 Aug 2019 7:13 AM GMTఎవరేమన్నా.. కొన్ని విషయాల్ని ఓపెన్ గా మాట్లాడుకుంటే విషయాలు మరింత క్లారిటీతో అర్థమవుతాయి. తాజాగా ఏపీ మంత్రి బొత్స సత్యానారాయణ చేసిన వ్యాఖ్యలు ఏపీలోనే కాదు.. తెలంగాణ రాష్ట్రంలోనూ సంచలనంగా మారాయి. దీనికి కారణం లేకపోలేదు. ఒక ప్రాంతంలో ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సంబంధించిన పనులు షురూ అయినంతనే.. రాజధాని నగరం నిర్మించే ప్రాంతంలోనే కాదు.. చుట్టుపక్కల రాష్ట్రాల వారూ ప్రభావితం అవుతారు.
తాజాగా అమరావతి విషయంలోనూ అదే జరిగింది. ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించటం.. అక్కడ మంచి ఫ్యూచర్ ఉండటంతో ఏపీకి చెందిన వారితో పాటు.. పెద్ద ఎత్తున తెలంగాణకు చెందిన వారు కూడా భూములు కొనుగోలు చేశారు. ఈ కారణంగానే స్వల్ప వ్యవధిలోనే అమరావతిలోనే కాదు.. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న భూముల ధరలకు భారీగా రెక్కలు వచ్చాయి.
మంచి ధర వచ్చినంతనే చేతిలో ఉన్న భూములు అమ్మేసి.. మళ్లీ కొనుగోలు చేస్తూ.. గొలుసు కట్టులో భూముల్ని అంతకంతకూ పెంచుకుపోయినోళ్లు కొందరైతే.. మరికొందరు కొన్న భూముల్ని తమ వద్దే ఉంచేసుకొని భారీ ప్రాజెక్టులకు ప్లాన్ చేసుకున్నోళ్లు ఉన్నారు. ఇంకొందరైతే.. తాము కొన్నదానికి భారీగా రిటర్న్స్ వచ్చే వరకూ వెయిట్ చేసి అమ్మాలని ప్లాన్ చేసుకున్నారు. ఇలా.. అమరావతి చుట్టుపక్కల ఉన్న భూముల్ని పెద్ద ఎత్తున కొన్నోళ్లలో ఆంధ్రోళ్లతో పాటు తెలంగాణకు చెందిన మోతుబరులు చాలామందే ఉన్నారు.
తాజాగా ఏపీ రాజధాని మీద సంచలన వ్యాఖ్యలతో పాటు.. వరదనీరు ప్రమాదం పొంచి ఉందన్న మాటల నేపథ్యంలో అమరావతిపై నీలినీడలు ముసురుకున్నట్లే. ఒకవేళ.. అదే నిజమైతే.. అమరావతి భూముల మీద పెట్టుబడులు పెట్టినోళ్లు.. తమ పొదుపు మొత్తాల్ని తీసుకొచ్చి అమరావతి మీద వెచ్చించినోళ్లంతా భారీగా నష్టపోవటం ఖాయం. అదే సమయంలో.. గుంటూరు.. విజయవాడ చుట్టుపక్కల పెట్టుబడులు పెట్టిన వారంతా అయోమయానికి గురి కావటంతో పాటు.. వ్యక్తిగతంగా భారీగా నష్టాలు చుట్టుకోవటం పక్కా అన్న మాట వినిపిస్తోంది.