Begin typing your search above and press return to search.
పవన్ కి బొత్స సలహా అదిరింది
By: Tupaki Desk | 15 Nov 2018 2:36 PM GMTఈ మధ్య వరసగా జగన్ పై విమర్శలు చేస్తున్న పవన్ పై బొత్స సత్యనారాయణ తనదైన శైలిలో దాడి చేశారు. పనిలో పనిగా ఓ మంచి సలహా ఇచ్చారు. పవన్ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు అని అడిగితే ఇంతవరకు సమాధానం సరిగా ఇవ్వలేదు. ఒకసారి ప్రశ్నించడం కోసం అంటారు. ఇంకోసారి నేను ముఖ్యమంత్రి అవుతా అంటారు. ఇంకోసారి ముఖ్యమంత్రి అయ్యే ఉద్దేశం లేదంటాడు. అసలు పవన్ కు ఓ క్లారిటీ అంటూ ఉండదు. నిజంగా జనం కోసం ప్రశ్నించడం కోసమే వస్తే ఆయన పార్టీ మూసేసి స్వచ్ఛంద సంస్థ పెట్టుకుంటే సరిపోతుంది కదా అన్నారు.
వైఎస్సార్ రాజకీయాల్లోకి వచ్చినపుడు పవన్ స్కూల్లో ఉండి ఉంటాడు. ఆయన సినిమా నుంచి బయటకు వచ్చింది ఎపుడు? అతను వైఎస్ ను ఎదిరించడం ఏంటి? పక్కనున్న నాదెండ్ల అయినా పవన్ ను వారించలేదా అన్నారు బొత్స. ఆయన కులానికి దూరంగా ఉంటాను అంటాడు... కానీ ఫేవరేట్ కులం అని ఒకటుందని చెప్పిన ఏకైక నేత పవనే. అతనికి కుల ధ్యాస తప్ప ఇంకో ధ్యాస లేదు. అసలు చంద్రబాబు పవన్ తో ఫ్రెండ్ షిప్ చేసిందే పవన్ కులం ఓట్లు లాక్కుందామని అదైనా గుర్తించాడో లేదో పవన్ అని వ్యంగంగా వ్యాఖ్యానించారు.
పవన్ లో అసలు విషయం లేదు. అది దాచుకోవడానికి పెద్ద పెద్ద పుస్తకాలు చదువుతూ ఫొటోలకు ఫోజులిస్తారు. అందులోని వాక్యాలను కోట్ చేస్తారు. అదంతా డప్పా... పవన్ లో అసలు విషయమే లేదన్నారు. ఆయనకు ఏ విషయంపై సరయిన అవగాహన లేదన్నారు బొత్స. ముందు ఆయన మాట్లాడటంలో మెరుగయితే మిగతా విషయాలు తరవాత చూసుకోవచ్చని - మనిషికి క్లారిటీ ముఖ్యం.. పవన్ కు లేనిదే అది అని పవన్ అన్నారు.