Begin typing your search above and press return to search.
వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికే బాబు నాటకం
By: Tupaki Desk | 1 Dec 2017 2:11 PM GMTకేంద్రానికి నమస్కారం పెట్టి పోలవరం పనులు అప్పగించేస్తానని అంటున్న చంద్రబాబు వ్యవహారాన్ని ఎవరూ నమ్మబోరని.. తన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ఇప్పుడు కల్లబొల్లి మాటలు చెబుతున్నారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆయన నిలువునా ముంచారని బొత్స మండిపడ్డారు. పోలవరాన్ని సకాలంలో పూర్తి చేయాలని ఆయన డిమాండు చేశారు.
ఒక మంచి నాయకుడు లేకపోతే రాష్ట్రం ఎలా నష్టపోతుందన్నది చంద్రబాబు నాయకత్వంలో అర్థమవుతోందని బొత్స అన్నారు. స్వార్థపరమైన నాయకత్వం వల్లే పోలవరం విషయంలో ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. పోలవరం నిర్మాణంలో ఎందుకు అవకతవకలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఆయన తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి విపక్షాలపై నిందలేస్తున్నారని... ప్రతిపక్షాలకి అభివృద్ధి అంటే పడదని, ప్రాజెక్టుని అడ్డుకుంటున్నారని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
కేంద్రం తానే నిర్మిస్తానని క్లియర్ గా చెప్పినా కూడా కేంద్రాన్ని బతిమలాడుకుని పోలవరం ప్రాజెక్టు పనుల బాధ్యతను తీసుకున్నారు.... ఆ క్రెడిట్ మొత్తం కొట్టేయాలనుకున్నారు. ఇక పోలవరంలో అవినీతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ఇవన్నీ ప్రజలకు తెలుసు. అంతా అయిపోయాక, సకాలంలో పూర్తిచేయలేక తిరిగిచ్చేస్తానంటున్నారన్నారు. విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మించాలని... లేని పక్షంలో ప్రజా ఉద్యమం నిర్మిస్తామని బొత్స రాష్ర్ట ప్రభుత్వాన్ని హెచ్చరించారు.