Begin typing your search above and press return to search.
ఏపీలో హీటెక్కిన పొలిటికల్ వార్..టీడీపీని నిషేధించాల్సిందే ?
By: Tupaki Desk | 20 Oct 2021 11:30 AM GMTఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వేడి మాములుగా లేదు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిథి పట్టాభిరామ్, సీఎం జగన్ పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆ వ్యాఖ్యల తర్వాత ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వైసీపీ, టీడీపీలు ఢీ అంటే ఢీ అనే విధంగా తలపడుతున్నాయి. కొన్నిచోట్ల పరస్పర ఘర్షణలు కూడా చోటు చేసుకుంటున్నాయి. పొలిటికల్ ఫైట్ కాస్తా ఫిజికల్ ఫైటింగ్ కు దారితీస్తుండటంతో ఎక్కడికక్కడ పోలీసులు నేతలను అరెస్ట్ చేస్తున్నారు. ఆ అరెస్టుల పైనా దుమారం రేగుతోంది.
ఇక తమ పార్టీ కార్యాలయంపై దాడి జరిగినందున ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని వెంటనే ఆర్టికల్ 356 ప్రయోగించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. చంద్రబాబు రాష్ట్రపతి పాలన డిమాండ్ పై వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఏకంగా టీడీపీ గుర్తింపునే టార్గెట్ చేసింది. రాష్ట్రంలో తాజా పరిస్థితులపై మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని చంద్రబాబు డిమాండ్ చేసిన నేపథ్యంలో బొత్స కౌంటర్ ఇచ్చారు. టీడీపీని నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు. మావోయిస్టులను నిషేధించిన మాదిరిగా టీడీపీని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. మావోయిస్టుల చర్యలకు మీకు ఎలాంటి తేడా లేదని టీడీపీని విమర్శించారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న టీడీపీని నిషేధించాలి. దీనిపై ఈసీకి లేఖరాస్తామని బొత్స అన్నారు. బీజేపీతో ఉన్న పవన్ కల్యాణ్ , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు టీడీపీని సమర్ధించడం వెనుక ఆంతర్యమేంటని బొత్స ప్రశ్నించారు. మొత్తానికి రాజకీయాల్లో టీడీపీని లేకుండా చేయాలని, ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని బొత్స కోరడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గానే చూడాలి.
ఇక ఇదిలా ఉంటే .. సోషల్ మీడియాలో సీఎం జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్ పై నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విరుచుకుపడ్డారు. తీవ్రపదజాలంతో మండిపడ్డ మంత్రి అనిల్, చంద్రబాబు, లోకేష్ కు వార్నింగ్ ఇచ్చారు. లోకేష్ నిజంగా రాయలసీమలో పుట్టుంటే రా చూసుకుందాంరా అని సవాల్ విసిరారు. ఫ్యాన్ రెక్కలు విరిచి తరిమికొడతానన్న లోకేష్ కు దమ్ముంటే నేరుగా తలపడాలన్నారు. వారం రోజుల పాటు నెల్లూరులో పోలీసులు, కాన్వాయ్ వదిలేసి తిరుగుతానని, తేల్చుకుందాం రావాలంటూ ఛాలెంజ్ చేశారు.