Begin typing your search above and press return to search.
రాధా.. ఏమిటి నీకు బాధ!?
By: Tupaki Desk | 25 Jan 2019 3:59 PM GMTనిజమే. వంగవీటి రాధా రెండు రోజులుగా చాలా బాధగా ఉన్నారు. అనుకున్నదొక్కటి... అయినది మరొకటి అన్న పాట చందంగా వంగవీటి రాధా ఒకటి అనుకుంటే మరొకటి అయిందంటున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చిన వంగవీటి రాధా ఏ పార్టీలో చేరాలో తెలియక సతమతమవుతున్నారు. ఏ పార్టీలో చేరాలో ముందుగా మాట్లాడుకోకుండా హడావుడి నిర్ణయాలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ని వదిలేసిన వంగవీటి రాధా కు ఇప్పుడు ఏ పార్టీ ఆహ్వానం పలకడం లేదంటున్నారు. పార్టీకి రాజీనామా చేస్తారని వార్తలు వచ్చిన నేపథ్యంలో విజయవాడ తెలుగుదేశం నాయకులు హుటాహుటిన వంగవీటి రాధా ను కలుసుకున్నారు. తాము చంద్రబాబు నాయుడు దూతల మని - తెలుగుదేశం పార్టీలో చేరాలంటూ ఆఫర్ ఇచ్చారు. దీంతో తెలుగుదేశం పార్టీలో తనకు ఘనస్వాగతం లభిస్తుందని వంగవీటి రాధ ఆశించారు. ఏమైందో ఏమో తెలియదు గానీ తెలుగుదేశం పార్టీ మాత్రం వంగవీటి రాధాను పార్టీలోకి ఆహ్వానించడం పై వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే వరకు మేమున్నామంటూ వంగవీటి రాధా కు అభయమిచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతానికి మొహం చాటేసింది. ఈ పరిణామాన్ని ఊహించని వంగవీటి రాధా మన భవిష్యత్తు అంధకారంలో ఉందని అనుచరుల వద్ద అన్నట్లు సమాచారం. ఒకటి రెండు రోజులలో తెలుగుదేశం పార్టీలో చేరతానని - విజయవాడ నుంచి తాను పోటీ చేయడం ఖాయమని వంగవీటి రాధా భావించారు. అయితే ఒక్కసారిగా సీన్ రివర్స్ అయ్యింది. తెలుగుదేశం పార్టీ నుంచి ఎలాంటి ఆహ్వానము రాకపోవడంతో భవిష్యత్తులో ఏం చేయాలో తెలియక వంగవీటి రాధా పునరాలోచనలో పడ్డారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు వంగవీటి రాధా కు ఇప్పటికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ స్థానం ఉందని, ఆయన తిరిగి పార్టీలోకి రావచ్చని సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ కూడా చెబుతున్నారు. మరి ఈ ఆఫర్‌ను వంగవీటి రాధ ఉపయోగించుకుంటారో లేక మొండిగా తన వాదన మీదే నిలబడతారో వేచి చూడాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వంగవీటి రాధ తిరిగి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని వారు చెబుతున్నారు.