Begin typing your search above and press return to search.

హిట్ల‌ర్‌.. చంద్ర‌బాబు బ‌ర్త్ డే ఒక్క‌టే

By:  Tupaki Desk   |   20 Dec 2017 11:23 AM GMT
హిట్ల‌ర్‌.. చంద్ర‌బాబు బ‌ర్త్ డే ఒక్క‌టే
X
తెలుగు ప్ర‌జ‌ల‌కు సుప‌రిచితులైన రాజ‌కీయ నేత‌ల్లో బొత్స స‌త్య‌నారాయ‌ణ ఒక‌రు. కాంగ్రెస్ హ‌యాంలో ఒక వెలుగు వెలిగిన బొత్స‌.. ఏదైనా విష‌యాన్ని టేక‌ప్ చేస్తే దాని అంతు చూసే వ‌ర‌కు నిద్ర పోర‌న్న పేరుంది. కొంత‌కాలంగా కామ్ గా ఉంటున్న ఆయ‌న తాజాగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై ఫైర్ అయ్యారు. మిగిలిన వారి మాదిరి తూతూ మంత్రంగా విమ‌ర్శ‌లు చేస్తే బొత్స మార్క్ ఏముంటుంది? కొత్త‌గా.. స‌రికొత్త‌గా విమ‌ర్శ‌లు సంధించ‌టంలో బొత్స మార్క్ స్ప‌ష్టంగా క‌నిపిస్తుంటుంది.

ప్ర‌తిప‌క్షాల్ని అణిచి వేసేలా ఏపీ అధికార‌ప‌క్షం కుట్ర‌లు చేస్తుందంటూ మండిప‌డిన బొత్స‌.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీరును తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. అధికారంలో ఉన్న చంద్ర‌బాబు.. నియంత హిట్ల‌ర్ బ‌ర్త్ డేట్ ఒక‌టేన‌ని.. ఇద్ద‌రు తీరు ఒక‌టేలా ఉంటుంద‌న్నారు.

దివంగ‌త మ‌హానేత వైఎస్ ఆశ‌యాల్ని నిజం చేసేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తుంటే.. అధికారంలో ఉన్న చంద్ర‌బాబు కుట్ర‌లు చేస్తున్నార‌న్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. ఎన్ని కుట్ర‌లు చేసినా.. ఎంత‌గా అవ‌మానించినా.. ధృడ సంక‌ల్పంతో జ‌గ‌న్ ముందుకు వెళుతున్నార‌న్నారు. జ‌గ‌న్ వ్య‌క్తిత్వాన్ని కించ‌ప‌రిచేలా క‌థ‌నాలు రాయిస్తూ అధికార పార్టీ గ్లోబ‌ల్ ప్ర‌చారాన్ని చేస్తుంద‌న్నారు.

ఏపీ ప్ర‌జ‌లు మంచి సంక్షేమ ప్ర‌భుత్వం కోసం ఎదురుచూస్తున్నార‌ని.. రాజ‌న్న రామ‌రాజ్యాన్ని జ‌గ‌న్ తీసుకొస్తార‌ని.. అందుకు నిద‌ర్శ‌న‌మే ఆయ‌న చేస్తున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌గా అభివ‌ర్ణించారు. ఇటీవ‌ల విశాఖ‌జిల్లా పెందుర్తి మండ‌లం జెర్రిపోతులపాలెంలో ద‌ళిత మ‌హిళ‌పై జ‌రిగిన దాడి నిద‌ర్శ‌న‌మ‌న్న బొత్స‌.. ఆ ఘ‌ట‌న‌ను తీవ్రంగా ఖండించారు.

పెందుర్తి ఘ‌ట‌న స‌భ్య స‌మాజం సిగ్గుప‌డేలా చేసింద‌ని.. త‌లదించుకునేట‌ట్లు ఉంద‌న్నారు. ఈ ఉదంతంపై ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే స్పందించి న్యాయ‌విచార‌ణ‌కు ఆదేశించాల‌న్నారు. దోషుల్ని క‌ఠినంగా శిక్షించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. బాబు స‌ర్కారు కొలువు తీరిన నాటి నుంచి ద‌ళితుల ప‌ట్ల వివ‌క్ష ప్ర‌ద‌ర్శించేలా చేస్తున్నార‌ని.. పెందుర్తి ఉదంతంపై త‌మ పార్టీకి చెందిన ఎస్సీ సెల్ నేత‌లు వాస్త‌వ ప‌రిస్థితుల్ని ప‌రిశీలించేందుకు వెళ‌తార‌ని చెప్పారు. నాటికి నేటికి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లోని తొమ్మిది కోట్ల మంది హృద‌యాల్లో చెర‌ని ముద్ర‌గా వైఎస్సార్ పేరు ఉంద‌న్న బొత్స‌.. తండ్రి ఆశ‌య సాధ‌న కోసం త‌న‌యుడు జ‌గ‌న్ నేతృత్వంలో ఏర్పాటైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క‌ళ‌క‌ళ‌లాడుతోంద‌న్నారు. రాష్ట్రానికి వైఎస్ జ‌గ‌న్ తో మంచి భ‌విష్య‌త్ ఉంద‌ని ఏపీ ప్ర‌జ‌లు న‌మ్ముతున్న‌ట్లుగా చెప్పారు.

ఉమ్మ‌డి రాష్ట్రంలో మాదిరి తెలుగు ప్ర‌జ‌లు నాడు ఎలా అయితే మూడు అక్ష‌రాల వైఎస్సార్ పేరు విన్నంత‌నే ఫ‌ర్లేదు.. అన్న ధీమా ఉండేదో.. ఇప్పుడు మ‌ళ్లీ అదే మూడు అక్ష‌రాల‌పై న‌మ్మ‌కం పెట్టుకున్నార‌ని.. ఆ మూడు అక్ష‌రాలే జ‌గ‌న్ అని అన్నారు. టీడీపీ నేత‌లు అధికార మ‌దంతో అప్ర‌జాస్వామ్య ప‌ద్ధ‌తిలో ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేస్తూ రాజ్యాంగాన్ని అవ‌హేళ‌న చేస్తున్నార‌న్నారు. జ‌గ‌న్ వ్య‌క్తిత్వాన్ని కించ‌ప‌రిచేలా క‌థ‌నాలు రాయిస్తూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నార‌ని.. ప్ర‌జ‌లు నిజాల్ని గ‌మ‌నిస్తూనే ఉంటార‌న్నారు. బాబు విష ప్ర‌చారంపై బొత్స ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.