Begin typing your search above and press return to search.
ఆస్తికి, లాయర్ ఫీజుకు సంబంధం వింటే షాకే
By: Tupaki Desk | 19 Nov 2016 5:40 AM GMTడబ్బు ఇచ్చి ఓటేయిస్తే తప్పేమీ కాదని - ఎన్నికల్లో గెలిచిన తరువాత అవినీతి చేస్తే తప్పు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసిద్ధ భారత రాజ్యాంగానికి కొత్త భాష్యం చెప్పారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఓటుకు కోట్లు కేసుకు సంబంధించి ఢిల్లీ నుంచి పిలిపించిన తన లాయర్ తో చంద్రబాబు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారని ధ్వజమెత్తారు. సాక్షాధారాలతో సహా ఎమ్మెల్యేకు డబ్బులు ఇస్తూ అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు కేసు నుంచి తప్పించుకునేందుకు అడ్డదారులు వెతుకుతున్నారని బొత్స ధ్వజమెత్తారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో బొత్స మాట్లాడుతూ....ఎమ్మెల్యే అవినీతితో గెలవడం తప్పులేదని బాబు కొత్త నిర్వచనానికి తెరలేపారని మండిపడ్డారు. చంద్రబాబు తీరు చూస్తుంటే రాష్ట్రాన్ని దోచుకోండి - అవినీతి చేయండి అనేలా ఉంది కానీ... ప్రజలకు సేవ చేయండి - రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి అనే మాటలు రాకపోవడం దురదృష్టకరమన్నారు.
తన ఆస్తి విలువ రూ. 50 లక్షలు అని చెప్పుకుంటున్న చంద్రబాబు ఢిల్లీ నుంచి పిలిపించుకున్న లాయర్ కు రోజుకు రూ. 10 లక్షలు ఎలా ఇస్తున్నారని బొత్స బాబును ప్రశ్నించారు. మీ ఆస్తి అంత తక్కువగా ఉంటే లాయర్ కు లక్షల్లో ఫీజు చెల్లించడం ఎలా సాధ్యమన్నారు. బాబు బూటకపు ఆస్తుల ప్రకటనపై ప్రజలు ఆలోచవ చేయాలన్నారు. రూ. 1000 - 500 నేనే రద్దు చేయమని చెప్పానని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటూ... రూ. 500 నోట్లు ఎమ్మెల్యేలను కొనడానికి లంచానికి పంపిస్తున్నారని ఆరోపించారు. నోట్ల రద్దుతో ప్రజలంతా ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు నేనే సర్వే చేయించాను 52 శాతం మంది నోట్ల రద్దుతో హాయిగా ఉన్నారని అబద్దాలు మాట్లాడుతున్నారని బొత్స మండిపడ్డారు. ప్రధాని పెద్దనోట్లు రద్దు నిర్ణయం తీసుకున్న మొదటి రోజే వైసీపీ వైఖరిని చెప్పామన్నారు. దేశంలో ఉన్న నల్లధనాన్ని వెలికి తీయడానికి ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయానైనా సమర్ధిస్తాం. కానీ సామాన్యులకు - మధ్యతరగతి ప్రజలకు ఇబ్బందులు కల్గకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందని సూచించామని గుర్తు చేశారు.
ప్రత్యేక హోదాతో పరిశ్రమలకు రాయితీలు రావని ముఖ్యమంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందని బొత్స సత్యనారాయణ అన్నారు. మరో టీడీపీ మంత్రి సుజనా చౌదరి హోదాను చెల్లని నోటుతో పోల్చుతున్నారని బొత్స మండిపడ్డారు. అధికారం ఉందనే అహంకారంతో చెల్లని నోటుతో హోదాను పోల్చతున్నారని ఫైరయ్యారు. ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేక సార్లు సమావేశాలు పెట్టి ప్రత్యేక హోదా వల్ల కలిగే లాభాలను వివరించారన్నారు. దేశంలో హోదా ఉన్న రాష్ట్రాలకు - లేని రాష్ట్రాలకు కేంద్రం ఏ విధమైన నిధులు ఇస్తుందో నీకు తెలియదా చంద్రబాబు అని ప్రశ్నించారు. హిమాచల్ ప్రదేశ్ కి హోదా వస్తే ఫార్మారంగం ఏపీ నుంచి తరలివెళ్లింది వాస్తవం కాదా అని నిలదీశారు. మేధావి కదా కంప్యూటర్ ఓపెన్ చేసుకొని హోదాతో ఎన్ని రాయితీలు ఉన్నాయో చూడండి అని బాబుకు చురకంటించారు. ఎప్పుడు మీ మాటలు ప్రజలు నమ్ముతారనుకోవడం పోరబాటని, రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు. టీడీపీ నేతలు వక్రభాషలను స్వచ్చమైన ఆంధ్రప్రజలపై రుద్ది వారి జీవితాలను నాశనం చేయవద్దని బొత్స హితవు పలికారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/