Begin typing your search above and press return to search.
ఓటుకు నోటు ఎఫెక్ట్ః రాజీనామా బాటలో బాబు
By: Tupaki Desk | 10 March 2017 4:45 AM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఘాటు విమర్శలు చేశారు. ఓటుకునోటు కేసులో తెలంగాణ ఏసీబీ దాఖలు చేసిన రెండవ చార్జిషీటులో కూడా పేరును 22 సార్లు, మొదటి చార్జిషీటులో 26 సార్లు ప్రస్తావించిందని, అందువల్ల చంద్రబాబు నైతిక విలువలకు లోబడి వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బొత్స విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ తాను నిప్పు అని పదే పదే చెప్పుకునే చంద్రబాబు ఇప్పటికైనా విచారణను ఎదుర్కొని నిప్పో - తుప్పో తేల్చుకోవాలన్నారు. సంఖ్యాపరంగా టీడీపీకి మెజార్టీ ఉందని, వేరొకరిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టుకోవచ్చని ఆయన కోరారు. ఇప్పటికే బాబు జైలుకు వెళితే ఎవరు సీఎం పదవికి సరిపోతారనే కోణంలో ఆ పార్టీ నేతలు చూస్తున్నారని బొత్స వ్యాఖ్యానించారు.
రాష్ట్రప్రజలకు మంచి సందేశం ఇవ్వాలంటే చంద్రబాబు పదవి నుంచి తప్పుకోవడం మేలని చంద్రబాబు అన్నారు. ఓటుకు నోటు కేసు కుట్ర మహానాడులో ప్రారంభమై హైదరాబాద్ లో ఒక నక్షత్రాల హోటల్ వరకు జరిగిన సంఘటనలపై 139 పేజీల చార్జిషీటులో వివరించారన్నారు. ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబి కోర్టుకు సమర్పించిన మొదటి ఛార్జీషీట్ లో 26 సార్లు - రెండో ఛార్జీషీట్ లో 22 సార్లు పేరు చంద్రబాబు పేరు నమోదైందన్నారు. ఈ కేసు తర్వాత ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న వరుస పరిణామాలు చూసిన వారికెవరికైనా చంద్రబాబు ఎందుకు భయపడుతన్నారో అర్థమవుతుందన్నారు. పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాగా, కేసు నుంచి బయట పడటం కోసం కేసీఆర్‌తో ఒప్పందం ప్రకారం చంద్రబాబు తోక ముడిచి అమరావతికి పారిపోయారని బొత్స ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో పదిహేనేళ్లు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసిన చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో చిక్కుకున్న నాటి నుంచి మాట మార్చారన్నారు. జాతీయ ప్రాజెక్టుగా కేంద్రమే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని విభజన చట్టం చెబుతున్నా, తన అవినీతి కోసం పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టే విధంగా అనుమతులు తెచ్చుకున్నారని ఆరోపించారు. కేసులో ఎక్కడా శిక్ష పడుతుందోననే భయంతో ప్రతి అంశంపై చంద్రబాబు రాజీ పడుతూ రాబోయే తరాల భవిష్యత్తును తాకట్టు పెట్టడుతున్నారని ధ్వజమెత్తారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/