Begin typing your search above and press return to search.
ఆ ఘనత చంద్రబాబుదే: బొత్స
By: Tupaki Desk | 7 Oct 2016 9:52 AM GMTఏపీ ప్రభుత్వం - ప్రభుత్వంలోని నేతలపై వైసీపీ అధికార ప్రతినిధి బొత్స సత్యనారాయణ ఫైరయ్యారు. హైదరాబాద్ లోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వ నేతల ధనదాహం ఎంతకీ తీరడం లేదంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. పలు అంశాల్లో న్యాయస్థానం హెచ్చరికలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఇసుక దందాల్లో ఉన్నవాళ్లంతా టీడీపీ నేతలేనని.. కేసులుంటే టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటున్నారని ఆరోపించారు. పేరుకు ఉచితమని చెబుతున్నా ఇసుకను టీడీపీ నేతలు అమ్ముకుంటున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వాధినేత చంద్రబాబు అయితే వీరందరికంటే ఘోరంగా ఏకంగా రాష్ట్ర ప్రయోజనాలను సింగపూర్ కంపెనీలకు తాకట్టు పెడుతున్నారని బొత్స విరుచుకుపడ్డారు. చంద్రబాబు స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించిన ఆయన భారీ వర్షాలు కురిసిన ప్రభుత్వం ప్రజల బాధలు పట్టించుకోలేదని విమర్శించారు. ఎన్నికల్లో తమ తరఫున డబ్బు సంచులు పంపిన వారికి ఇప్పుడు ప్రభుత్వం దోచిపెడుతోందని ఆరోపించారు.
ఏపీలో అన్ని ప్రభుత్వం శాఖలు అవినీతిలో కూరుకుపోయాయని.. ఇలా అవినీతిలో ప్రభుత్వ శాఖలను ముంచిన ఘనత చంద్రబాబుదేనని బొత్స మండిపడ్డారు. ముఖ్యంగా టీడీపీ నేతల ఇసుక ఆగడాలపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇస్తామని చెప్పినప్పటికీ టీడీపీ మంత్రులు - ఎమ్మెల్యేలు ఇసుక వ్యాపారం చేస్తూ దోచుకుంటున్నారని.. సామాన్యులకు ఇసుక ఉచితంగా దొరకడం లేదని ఆరోపించారు. మొత్తంగా చంద్రబాబు ప్రభుత్వమే అవినీతి ప్రభుత్వమంటూ బొత్స విమర్శల వర్షం కురిపించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/