Begin typing your search above and press return to search.
భువనేశ్వరితో మాట్లాడినా బొత్సకు చెప్పాలా?
By: Tupaki Desk | 19 Oct 2015 10:28 AM GMTవైసీపీలో కొత్త సీనియర్ లీడర్ బొత్స సత్యనారాయణ ఆ పార్టీలోని పాత సీనియర్లు వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారు కానీ చంద్రబాబును మాత్రం తమ ప్రశ్నలకు సమాధానం చెప్పమని అడుగుతున్నారు. వైసీపీలోకి ఏకులా వచ్చి మేకులా మారిపోయిన బొత్స అక్కడ అందరినీ శాసించేలా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఆయన ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలవడంపై విమర్శలు కురిపిస్తున్నారు. చంద్రబాబు, కేసీఆర్ లు ఏం మాట్లాడుకున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు శంకుస్థాపనకు ఆహ్వాన పత్రాలను తనకు పంపించవద్దంటూ జగన్మోహన్ రెడ్డి రాసిన బహిరంగ లేఖకు ప్రభుత్వం సమాధానం ఇవ్వకపోవడాన్ని బొత్స తప్పు పట్టారు. లేఖలోని ఏ ఒక్క అంశానికి కూడా ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదని ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపన పేరుతో ప్రభుత్వం చేస్తున్న దోపిడీని తాము వ్యతిరేకిస్తున్నామని బొత్స చెబుతున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి అనవసరమైన ఆడంబరాలకు పోతున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రానికి రాజధాని అవసరమని, దానికి తాము వ్యతిరేకం కాదని, అయితే శంకుస్థాపన పేరుతో చేస్తున్న దోపిడీని తాము వ్యతిరేకిస్తున్నామని బొత్స చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న భూదందాకు, హంగామాకు తాము వ్యతిరేకమని అన్నారు. రాష్ట్రాన్ని సింగపూర్ కు తాకట్టు పెడుతున్న కార్యక్రమానికి వచ్చి సాక్షి సంతకాలు పెట్టాలా అని ఆయన అడిగారు. భూమి పూజ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు పిలువలేదని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ తో చంద్రబాబు ఏం మాట్లాడారో చెప్పాలని బొత్స డిమాండ్ చేస్తున్నారు. చూడబోతే భార్య భువనేశ్వరితో చంద్రబాబు ఏం మాట్లాడారో కూడా చెప్పమనేలా ఉన్నారు బొత్స.
ఇంతకీ బొత్స ఇలా చంద్రబాబుపై కారాలుమిరియాలు ఎందుకు నూరడంపై టీడీపీ శ్రేణులు ఓ కారణం చెబుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో తన కంటే జూనియర్లు, చిన్న పదవుల్లోనే ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, రఘువీరారెడ్డి వంటివారిని ఇప్పుడు చంద్రబాబు ఈ కార్యక్రమానికి పిలుస్తున్నారు. వారివారి పదవుల ప్రకారం వారికి ఆహ్వానాలు అందాయి. కానీ... అలాపార్టీ పరంగా కీలక పదవిలో లేని బొత్సకు ఆహ్వానం అందలేదు. కనీసం తన పాత స్టేటస్, హైటువెయిట్ చూసైనా ఆహ్వానిస్తారని ఆశించినా చంద్రబాబు ఆ ఛాన్సివ్వలేదట. జగన్ వెళ్లకపోవడంతో తామూ వెళ్లే అవకాశం లేకపోయినా కనీసం పిలుపు వస్తే గౌరవంగా ఉండేదని... కానీ, అలా జరగకపోవడంతో బొత్స చాలా ఫీలవుతున్నారని సమాచారం. ఆ ఫ్రస్ట్రేషన్ లోనే చంద్రబాబును తిడుతున్నట్లుగా ఉంది.