Begin typing your search above and press return to search.

టీడీపీ ఆత్మ‌గౌర‌వం అంటే ఇదేనా?

By:  Tupaki Desk   |   8 Oct 2016 7:48 AM GMT
టీడీపీ ఆత్మ‌గౌర‌వం అంటే ఇదేనా?
X
రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేశ్ రాజ్యాంగేతర శక్తిగా అవతరించారని, ఇది రాష్ట్ర అభివృద్ధికి విఘాతంగా పరిణమించిందని వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ లోని లోటస్‌ పాండ్‌ లో విలేక‌ర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ - మంత్రులు - నేతలతో జరిగిన సమీక్ష కార్యక్రమంలో లోకేశ్ సీనియర్ మంత్రులు - నేతలను అవమానించారన్నారు. ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పను ప్రశ్నించే విధంగా లోకేశ్ వ్యవహరించరిన తీరుపు సర్వత్రా చర్చ జరుగుతోందని బొత్స అన్నారు. చినరాజప్పను ప్రశ్నించడానికి లోకేశ్ ఏమైనా పార్టీ అధ్యక్షుడా? అని ప్రశ్నించారు. వయస్సులో పెద్దవాడైన ఉపముఖ్యమంత్రినే గౌరవించే సంప్రదాయంలేని పార్టీ తెలుగుప్రజల ఆత్మగౌరవాన్ని ఎలా కాపాడుతుందన్నారు. హోంశాఖ మంత్రిని లోకేశ్ ప్రశ్నిస్తే పోలీసు శాఖ మంత్రి మాట ఏం వింటుందన్నారు. చిన‌రాజ‌ప్ప‌ను చూసి అంతా పాపం అనుకుంటున్నార‌ని బొత్స వ్యాఖ్యానించారు.

అమరావతి నిర్మాణానికి స్విస్‌ చాలెంజ్ విధానాన్ని అమలు చేయడంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నా లెక్కచేయకుండా కొత్త శాసనాన్ని తీసుకురావాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను వెనక్కు తీసుకోవాలని బొత్స డిమాండ్ చేశారు. స్విస్‌ చాలెంజ్ వల్ల విదేశీ కంపెనీలకు ప్రయోజనం కలుగుతుందని, రాష్ట్ర అభివృద్ధికి పాతర వేసే విధంగా స్విస్‌ చాలెంజ్ ఉందన్నారు. స్విస్ చాలెంజ్‌ పై కోర్టులో వాద‌న‌లు ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం ముందుకు వెళుతుండ‌టం చూస్తుంటే అవినీతికి బాబు గేట్లు తెరిశార‌ని స్ప‌ష్టం అవుతోంద‌ని బొత్స ఆరోపించారు. రాష్ట్రప్రభుత్వ పాలసీలకు జవాబుదారీతనం లేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గంటల తరబడి ఉపన్యాసాలతో కాలక్షేపం చేస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో వారం వారం సమీక్షల కంటే, ప్రాజెక్టు పనులను నత్తనడకన చేపడుతున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలని బొత్స కోరారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/