Begin typing your search above and press return to search.
రామోజీది సొంత 'సామాజిక' స్ఫూర్తి: బొత్స
By: Tupaki Desk | 9 Jan 2020 1:24 PM GMTమంచి కార్యక్రమాలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వంపై ఈనాడు, ఏబీఎన్ ఛానెల్ దుష్ప్రచారం చేస్తున్నాయంటూ ఏపీ మంత్రి బొత్స ఫైరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ‘ఈనాడు’ ఎడిషన్ లో ఈరోజు ప్రచురితమైన ఓ కథనంపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, "ఈనాడు పత్రికలో ‘ఇవి తెలుసా? అని హెడ్డింగ్ పెట్టి ‘సచివాలయం.. 2016 అక్టోబరు నుంచి పాలన సాగుతోంది’ అని రాశారు. అవును.. సాగుతోంది. కాదని ఎవరూ అనలేదు. కానీ, తాత్కాలిక సచివాలయంలో పాలన సాగుతోందన్న మాట. ‘తాత్కాలిక’ అన్న మాటను దాచారు. ఇది వాస్తవం కాదని రామోజీరావు గారిని చెప్పమనండి? అని ప్రశ్నించారు. అదే విధంగా, 2017 నుంచి శాసనమండలి, శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయని రాశారు. ఇక్కడ కూడా, ‘తాత్కాలిక’ అన్న పదాన్ని రాయలేదు. ‘హంగులన్నీ అమరిన రాజధాని.. అమరావతిలో అదనంగా ఖర్చు చేయాల్సిన అవసరమే లేదు’ అంటూ ఈరోజు ‘ఈనాడు’లో ఈ కథనం ప్రచురించారు. ఇదే పత్రికలో ఎన్నికలకు ముందు (డిసెంబర్ 24, 2018) ‘నిలువెత్తు దగా’ అనే శీర్షికతో రాజధానికి సాయం కావాలని కోరుతూ ఓ కథనాన్ని ప్రచురించారు" అని చెప్పిన బొత్స, ఈ రెండు కథనాలను పోల్చి చూస్తూ విమర్శలు చేశారు.
‘అమ్మ ఒడి’పై ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన పత్రికలో ఉన్నప్పటికీ ‘శ్రీమాన్ రామోజీరావు గారి తాలూకా స్వార్థం.. రామోజీరావుగారి తాలూకా సమాజ స్ఫూర్తి.. కాదు సామాజిక స్ఫూర్తి కార్యక్రమం కనిపిస్తుంది’ అంటూ ఆ పత్రికలో వెలువడ్ద మరో వ్యతిరేక కథనాన్ని చూపించారు. అందుకే రామోజీరావుకు సామాజిక స్ఫూర్తి కంటే సొంత సమాజ స్ఫూర్తి ఎక్కువ ఉంది అంటాను నేను అంటూ పదునైన విమర్శలు చేశారు. ‘వయసు పెరిగింది.. అనుభవం ఉంది. ఎందుకు ఇలాంటి రాతలు రాసుకుని ఏం సాధించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు? దేనికోసం ఈ కార్యక్రమాలు చేస్తున్నారు?’ అంటూ రామోజీరావుపై బొత్స ప్రశ్నల వర్షం కురిపించారు.
కాగా ఆంధ్రజ్యోతిలో అమ్మఒడి పథకంపై వ్యతిరేక కథనాలు రావడంపైనా ఆయన మండిపడ్డారు. అమ్మఒడి ప్రకటన ఆంధ్ర జ్యోతికి రాకుండా ఈనాడు, సాక్షిలకు ఇవ్వడంతో జ్యోతిలో వ్యతిరేక కథనాలు రాశారంటూ పలువురు ఇతర వైసీపీ నేతలు వ్యాఖ్యానించారు.