Begin typing your search above and press return to search.
టీడీపీ నేతలు తినేది అన్నమా....గడ్డా
By: Tupaki Desk | 26 Aug 2015 12:34 PM GMTటీడీపీ నేతలపై వైకాపా నాయకుడు బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టును జగన్ అడ్డుకుంటున్నారని విమర్శిస్తున్న తేదేపా నేతలు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని...వాస్తవంగా పోలవరం ప్రాజెక్టు వద్ద తట్టెడు మట్టి పని కూడా జరగలేదన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం, ఐఏఎస్ అధికారి స్వయంగా చెప్పి... టీడీపీ ప్రభుత్వానికి తలంటినా సిగ్గురాలేదా అని ప్రశ్నించారు.
ఇవన్ని పట్టకుండా టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ జగన్ ను విమర్శించడం తగదని బొత్స ఫైర్ అయ్యారు. టీడీపీ నేతలు అన్నం తింటున్నారా..గడ్డి తింటున్నారా అనే సందేహం కూడా కలగక మానదని బొత్స తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. రుణమాఫీ, పోలవరం ప్రాజెక్టు విషయంలో టీడీపీ నేతలు చేసిన మోసానికి చీటింగ్ కేసులు పెట్టాలా ? వద్దా ? అని కూడా బొత్స ప్రశ్నించారు.
ప్రత్యేక హోదా అవసరం లేదని చంద్రబాబు ఎలా అంటున్నారని,ఎన్నికల ముందు ప్రత్యేక హోదా గురించి ఆయన ఎందుకు ప్రచారం చేశారని..ఈ విషయంలో చంద్రబాబు చేసింది మోసం కాదా అని బొత్స ఎద్దేవా చేశారు. ప్రత్యర్థులపై కాస్త కటువుగానే విమర్శలు చేసే బొత్స టీడీపీ నాయకులు ఏకంగా గడ్డి తింటున్నారా అని అనడం అసాధారణమే. బొత్స విమర్శలపై వారు ఎలా రియాక్ట్ అవుతారో..ఆయనకు రిప్లే ఎంత ఘాటుగా ఇస్తారో చూడాలి.