Begin typing your search above and press return to search.
గవర్నర్ కు అటూ ఇటూ..
By: Tupaki Desk | 9 Jun 2015 11:30 AM GMTఉమ్మడి రాష్ర్టాల గవర్నర్ నరసింహన్ ఇపుడు వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఓటుకు నోటు కేసు రెండు పార్టీలను దాటి రెండు రాష్ర్టాల విషయంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గవర్నర్ ఏం చేస్తున్నారనే దానితో పాటు ఆయన ఏం చెయ్యనున్నారనే ఆసక్తి కూడా పెరిగిపోతోంది. తాజాగా ఆయనకు మద్దతుగా ఒక పార్టీ, నిలదీస్తూ మరో పార్టీ మాటల తూటాలు పేల్చాయి.
ఓటుకు నోటు వ్యవహారంలో ఉమ్మడి రాజధానిలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఫోన్ ట్యాప్ చేశారని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో ఉమ్మడి రాజధానిలో ఉన్న గవర్నర్ ఏం చేస్తున్నారని నిలదీశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ తన అధికారాలు ఉపయోగించుకుంటున్నారని, ఇక్కడ అలాంటిదేమీ జరగడం లేదన్నారు. గవర్నర్ నరసింహన్ దేవుడికి పొర్లుదండాలు పెడతారు...నరసింహన్‌కు కేసీఆర్ మొక్కుతారు అందుకే హక్కులేవి పట్టించుకోరా అని ప్రశ్నించారు.
ఓటుకు నోటు కేసులో గవర్నర్ ను లాగడం ఏంటని వైఎస్ఆర్ సీపీ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. రాష్ట్ర గవర్నర్ ను అవమానిస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. సీఎం ఫోన్ ట్యాప్ చేయడం నేరమైతే దానికి చట్టాలున్నాయని, దానికి వ్యతిరేకంగా చట్టప్రకారం పోరాడాలని బొత్స సూచించారు. చంద్రబాబు చేసిన తప్పులను ఆంధ్ర ప్రజలు మోసేలా చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వీధిపోరాటాలు చేస్తుంటే తమ పార్టీ చూస్తూ ఊరుకోదని బొత్స స్పష్టం చేశారు.
మొత్తంగా గవర్నర్ కేంద్రంగా ఇరు రాష్ర్టాలు తమ అస్త్రాలకు పదును పెడుతున్నాయి.