Begin typing your search above and press return to search.
అందుకే ట్రంప్ విందుకు జగన్ ని పిలవలేదు..ఎందుకంటే!
By: Tupaki Desk | 26 Feb 2020 11:53 AM GMTఅమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ..రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇండియా కి వచ్చి , తన టూర్ ని దిగ్విజయంగా ముగించుకొని , అమెరికాకి పయనమై వెళ్లిపోయారు. కాగా, ప్రెసిడెంట్ అఫ్ అమెరికా ట్రంప్ ఇండియా పర్యటనకి వచ్చిన నేపథ్యంలో గౌరవార్థం ఇండియా ప్రెసిడెంట్ రామనాధ్ కోవింద్ అయన కోసం ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసారు. అయితే , డొనాల్డ్ ట్రంప్ కు రాష్ట్రపతి ఇచ్చిన విందు పై ఏపీ లో రాజకీయ దుమారం రేగుతోంది. ఈ విందు పై వైసీపీ - టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది.
ప్రస్తుత ప్రజా చైతన్య బస్సు యాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుప్పంలో మాట్లాడుతూ .. ట్రంప్ తో విందుకు పిలవకపోవడంపై.. సీఎం జగన్ ను టార్గెట్ గా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. దీనితో ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతల దీటుగా సమాధానం ఇస్తున్నారు. చంద్రబాబు విమర్శలపై తాజాగా స్పందించిన ..మంత్రి బొత్స సత్యనారాయణ చంద్రబాబు కడుపు మంటతో సీఎం జగన్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఆయనే తెలివైనవారు.. మిగిలిన వారు అమయాకులు అనుకుంటున్నారని అయన పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏపీ ప్రజలకు అన్నీత తెలుసని.. అంత అమాయకులు ఏమి కాదు అని అన్నారు.
అలాగే మా నాయకుడు జగన్ మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు.. నవీన్ పట్నాయక్ నాలుగుసార్లు ముఖ్యమంత్రి, ఆయనకు ఆహ్వానం ఎందుకు అందలేదని బాబుని సూటిగా ప్రశ్నించారు. బీజేపీ వాళ్ల సమీకరణలు ఆలోచనలు వాళ్లకు ఉంటాయని అన్నారు. రాష్ట్రాల్లో ఎవరికైతే బలమైన నాయకత్వాలు ఉన్నాయి.. అలాంటి వాళ్లను పిలవలేదన్నారు. అందుకే జగన్ కు పిలవలేదని తాము అనుకుంటున్నామని, ఇంకో కారణం ఏమైనా ఉండవచ్చు అని అన్నారు. ఈ దేశంలో జగన్ బలమైన నాయకుడని తాము బలంగా నమ్ముతున్నాము అని తెలిపారు.