Begin typing your search above and press return to search.

కుండబద్ధలు కొట్టిన బొత్స ...అంతా జగన్ ఇష్టమే?

By:  Tupaki Desk   |   9 Jan 2022 2:48 PM GMT
కుండబద్ధలు కొట్టిన బొత్స ...అంతా జగన్ ఇష్టమే?
X
వైసీపీలో సీనియర్ మంత్రిగా బొత్స సత్యనారాయణకు ఉన్న విలువ గౌరవం వేరు. ఆయన వైఎస్సార్ హయాంలో ఫస్ట్ టైమ్ మంత్రి అయ్యారు. అలా రెండు సార్లు కాంగ్రెస్ అధికారంలో ఉమ్మడి ఏపీలో ఉంటే ఎన్నో కీలకమైన మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. పీసీసీ చీఫ్ గా కూడా యునైటెడ్ ఏపీకి పనిచేశారు. ఇక ముఖ్యమంత్రి పదవి అన్నది ఆయన దరిదాపుల్లోకి వచ్చి వెళ్ళిపోయింది. విభజన తరువాత బొత్స కాంగ్రెస్ ని వీడి వైసీపీ వైపు వచ్చారు. జగన్ ప్రజాకర్షణకు తన బలాన్ని కూడా జోడించి 2019 ఎన్నికల్లో విజయనగరం జిల్లాను స్వీప్ చేసి పారేశారు.

గత రెండున్నరేళ్లుగా ఆయన మునిసిపల్ శాఖ మంత్రిగా కొనసాగుతున్నాయి. మంత్రి వర్గ విస్తరణ జరిగుతుందని కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్న వేళ బొత్స తన మనసులో మాటను కుండబద్ధలు కొట్టారు. తాజాగా మీడియాతో ఆయన మాట్లాడుతూ మంత్రి పదవిలోకి ఎవరిని తీసుకోవాలి. ఎవరిని తొలగించాలి అన్నది పూర్తిగా ముఖ్యమంత్రి ఇష్టమని, అదంతా జగన్ ఇష్టప్రకారం జరిగే విధానమని అన్నారు.

ఇందులో రెండవ మాటకు తావు లేనే లేదని కూడా అన్నారు. ఇక జగన్ తాను జగన్ ఇష్టప్రకారమే నడచుకుంటానని చెప్పారు. తనకు పార్టీ పదవి అప్పగిస్తారా లేదా మంత్రిగా కొనసాగిస్తారా అన్నది జగన్ ఇష్ట ప్రకారమే జరుగుతుందని చెప్పుకొచ్చారు. తాను సీనియర్ నేతగా ఉన్నానని, పార్టీ లైన్ దాటే సీన్ అయితే లేదని ఆయన తేల్చి చెప్పేశారు. అంతే కాదు తాను రాజకీయాల్లోనే పుట్టానని కూడా చెప్పారు.

మొత్తానికి జగన్ ఎవరిని మంత్రిగా చేస్తే వారే ఉంటారు అని చెప్పడం ద్వారా దేనికైనా రెడీ అన్నట్లుగా బొత్స తన మనోగతాన్ని చాటారు. మరి జగన్ కనుక బొత్సను అనేక సామాజిక రాజకీయ సమీకరణల నేపధ్యంలో కొనసాగిస్తే ఆయనకు హ్యాపీయే. అందుతున్న సమాచారం బట్టి చూస్తే బొత్సను జగన్ తప్పించబోరనే అంటున్నారు. అందుకే బొత్స కూడా ధీమాగానే మాట్లాడుతున్నారు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.