Begin typing your search above and press return to search.
చర్చలకు రావాలన్నప్పుడు.. ప్రస్తుతానికి పాత జీతాలే అనొచ్చుగా బొత్స?
By: Tupaki Desk | 30 Jan 2022 7:57 AM GMTఏపీ ఉద్యోగులకు కొత్త కష్టం వచ్చి పడింది. కొండ నాలుక వేస్తే ఉన్న నాలుక పోయిందన్న చందంగా వారి పరిస్థితి మారింది. కొత్త జీతాలతో తమ ఆదాయం మరింత పెరుగుతుందని భావిస్తే.. జగన్ సర్కారు దెబ్బకు.. కొత్త జీతాల సంగతి దేవుడెరుగు.. పాత జీతాలు నిలిస్తే అదే పది వేలు అన్నట్లు మారింది. ఇప్పటివరకు ఎప్పుడూ లేని రీతిలో.. కొత్త జీతాలు వద్దు సామి.. పాత జీతాలే ముద్దు సార్ అన్న నినాదాలు చేస్తున్న ఏపీ ఉద్యోగుల్ని దేశంలోని ఇతర రాష్ట్రాల వారు కాసింత చిత్రంగా చూస్తున్న పరిస్థితి.
ఇప్పటికే చేతికి వచ్చే జీతాలు కోత పడి.. కొత్త జీతాల రూపంలో వస్తున్నాయన్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని ప్రభుత్వం వాదిస్తూ.. కొత్త పీఆర్సీ కారణంగా ప్రభుత్వానికి రూ.10వేల కోట్ల అదనపు భారం పడుతుందన్న మాటను పదే పదే చెప్పటం తెలిసిందే. దీనికి భిన్నంగా ప్రభుత్వ ఉద్యోగుల వాదన వినిపిస్తోంది. ఇలాంటి వేళ.. ప్రభుత్వ బడ్జెట్ పెరిగినప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎలా తగ్గుతాయి? సంబంధం లేని రెండు అంశాలు ఎందుకు కనిపిస్తున్నాయి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
ఒకవేళ ఉద్యోగ సంఘాలు చేస్తున్న వాదన తప్పు అయితే.. ఇప్పటికే వారు తయారు చేసిన నమూనాలకు కౌంటర్ గా.. కొత్త జీతాలు ఎంత పెరుగుతాయన్నది పేర్కొంటూ వివరాలు విడుదల చేస్తే సరిపోయేది. అన్ని కన్ఫ్యూజన్లు తొలిగిపోయేవి. అవేమీ చేయకుండా కొత్త జీతాలతో ప్రభుత్వ ఖజానా మీద రూ.10వేల కోట్లు అదనపు బారం పడుతుందని చెప్పటంలో అర్థం లేదనే చెప్పాలి. ఇదిలా ఉంటే..కొత్త జీతాలు మాకొద్దు మహాప్రభూ అంటూ నిరసనకు దిగుతున్న ఉద్యోగులు ప్రభుత్వంతో చర్చలకు రావాలని పిలిచినా.. రావట్లేదంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చెబుతున్నారు.
అయితే.. ప్రభుత్వంతో చర్చలకు తమకు అభ్యంతరం లేదని.. కొత్త జీతాలు కాకుండా పాత జీతాలు ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తూ.. కొత్త జీతాల జీవోను నిలుపుదల చేయాలని.. అప్పుడే చర్చకు వస్తామని చెబుతున్నారు. ఈ విషయం మీద ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాకపోవటంతో.. వారు చర్చలకు రాని పరిస్థితి. ఈ ఉదంతాన్ని చూస్తే.. ఉద్యోగులు అడుగుతున్నది గొంతెమ్మ కోరిక కాదనే చెప్పాలి. ఎందుకంటే.. వారు జీతాలు పెంచమని ఇప్పుడు అడగటంలేదు.. తమకు ఇప్పటికే వస్తున్న జీతాల్ని కంటిన్యూ చేస్తామని మాట ఇస్తే.. చర్చలకు వస్తామంటున్నారు. జీతాలు తగ్గవన్న ధీమా ఉన్నప్పుడు.. ఉద్యోగ సంఘాల వారు కోరినట్లుగా నిర్ణయం తీసుకుంటే.. ఇష్యూనే లేదు కదా? తాము పిలిచినా చర్చలకు రావట్లేదన్న మాటే ఉండదు కదా? మరి.. మంత్రి బొత్స ఈ పాయింట్ ను ఎలా మిస్ అవుతున్నారు?