Begin typing your search above and press return to search.
మా సీఎం చంద్రబాబు అనుకున్నారా?.. మంత్రి సెటైర్‌తో నవ్వులు...!
By: Tupaki Desk | 6 Jan 2022 12:30 AM GMTకొన్ని కొన్ని విషయాలు ఆసక్తిగా ఉంటాయి. నవ్వుల పువ్వులు పూయిస్తాయి. ఇలాంటి ఘటనే ఒకటి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కొన్ని రోజల కిందట జరిగింది. అయితే.. ఆలస్యంగా వెలుగు చూడడం గమనార్హం. విషయం ఏంటంటే.. ఈ క్యాంపు కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు భేటీ అవుతారు. మీడియాకు ఇక్కడ నుంచే బైట్లు ఇస్తుంటారు. అయితే.. కొన్ని నెలలుగా క్యాంపు కార్యాలయంలో ఉన్న ఈ మీడియా సెంటర్‌లో వాటర్ ఫెసిలిటీ లేకుండా పోయింది. బాటిల్స్ ఇస్తున్నారు. అయితే.. ఇవి కూల్‌గా ఉండడం లేదని చాలా మంది మీడియా మిత్రులు వాటిని తీసుకోవడం మానేశారు.
ఈ క్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఒకరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సుదీర్ఘంగా ఆయన రెండు గంటలు ప్రసంగించారు. ఈ సమయంలో మీడియా మిత్రులు.. మంత్రి కోసం తెచ్చిన వాటర్ బాటిల్‌ను తీసుకుని .. షేర్ చేసుకున్నారు. దీనిని పరిశీలించిన మంత్రి.. అదేంటి నా నీళ్లు తాగుతున్నారు? అని ప్రశ్నించారు. దీనికి మీడియామిత్రులు.. మాకు నీళ్లు ఇవ్వడం లేదు.. అని చెప్పారు.. వెంటనే కార్యాలయం చీఫ్‌ను పిలిచిన మంత్రి బొత్స.. మంచి నీళ్లు ఇవ్వకుండా మీడియా వాళ్లను పిలుస్తారా? అని ప్రశ్నించారు. దీనికి ఆయన బాటిల్స్ ఇస్తున్నామని.. ట్యాంకరు కూలింగ్ ఇబ్బందిగా ఉండడంతో వాటర్‌ను నిలిపివేశామని చెప్పారట.
దీంతో బాటిల్స్ ఇస్తున్నారు కదా.. అని మంత్రి బొత్స.. మళ్లీ.. మీడియా మిత్రులను ప్రశ్నించారు.దీనికి వారు కూలింగ్ వాటర్ ఇవ్వడం లేదని.. కూలింగ్ ట్యాంకు పాడైందని సమాధానం ఇస్తున్నారని.. చెప్పారట. దీంతో వెంటనే బాగు చేయించాలని ఒకరిద్దరు.. మీడియా ప్రతినిధులు మంత్రి కి చనువుగా సూచించారు. అయితే.. దీనిపై మీడియా సెంటర్ ఇంచార్జ్‌కి చెబుతానని అన్నారట మంత్రి వర్యులు. దీంతో వెంటనే ఓ మీడియా ప్రతినిధి.. గతంలోనూ ఇలానే మంచినీళ్లు కావాలని అడిగితే.. సీఎంను అడిగి చెబుతానని అన్నారని.. ఇప్పుడు కూడా అంతేనా.. నాడు-నేడు మార్పు లేదా? అని వ్యంగ్యాస్త్రం గుప్పించారట.
అయితే.. దీనికి వెంటనే మంత్రి బొత్స స్పందిస్తూ.. ``మా సీఎం ఏమన్నా..చంద్రబాబు అనుకున్నారా.. మంచినీళ్లకు టీ కాఫీలకు ఆయన పర్మిషన్ అక్కర్లేదు. రేపట్లోగా మీకు కూలింగ్ వాటర్ ఉంటుంది. `` అని అనేసరికి.. నవ్వుల పువ్వులు విరిశాయట. అయితే.. చిత్రం ఏంటంటే..రెండు గంటల్లోనే ప్లాంటును బాగు చేయించి.. కూలింగ్ వాటర్ ఇచ్చే ఏర్పాటు చేశారు.