Begin typing your search above and press return to search.

ఆహా : వినండి బొత్స..! చెబుతున్న‌దంతా నిజ‌మే !

By:  Tupaki Desk   |   26 April 2022 2:30 PM GMT
ఆహా : వినండి బొత్స..! చెబుతున్న‌దంతా నిజ‌మే !
X
ప్ర‌భుత్వాలు మారినంత మాత్రాన పాల‌సీలు మారినంత మాత్రాన కేటాయింపులు పెరిగినంత మాత్రాన సంబంధిత కీల‌క రంగాలు అనుకున్నంత వేగంగా అభివృద్ధిని సాధించ‌డం కానీ ప్ర‌గ‌తి ఫ‌లాలు అందుకోవ‌డం కానీ సాధ్యంకావు. గ‌తంలో క‌న్నా కొంత బెట‌ర్ అనిపించుకోవాల‌న్న తప‌న మ‌రియు తాప‌త్ర‌యం బొత్స‌కు ఉండ‌నివ్వండి ఎవ్వ‌రూ కాద‌న‌రు కానీ విద్యా రంగంలో ఉన్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్రాధాన్యం ఇస్తే అప్పుడు ఈ ప్ర‌భుత్వం గ‌తం క‌న్నా బెట‌ర్ అని చెప్ప‌గ‌లం. అదే రీతిన వైద్య రంగంలో నెల‌కొన్న చాలా అప‌రిష్కృత స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చూపితే అప్పుడు ఇంకాస్త మంచి ప్ర‌భుత్వం ఇదేన‌ని తేల్చ‌డం సాధ్యం. అవేవీ లేకుండా మాట్లాడ‌డం అంత మేలు కాదు.

విద్యా,వైద్య రంగాలు త‌మ‌కు రెండు క‌ళ్లు అని చెబుతున్నారు మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ. దీనిపై ఇప్పుడు చ‌ర్చిద్దాం. అసలు ఆ రోజు రెండు క‌ళ్ల సిద్ధాంతి అని వైసీపీ పాపం చంద్ర‌బాబుపై మాట‌ల యుద్ధ‌మే చేసింది. స‌మైక్యాంధ్ర ఉద్య‌మాల నేప‌థ్యంలో ప్ర‌త్యేక ప‌రిస్థితులు నెల‌కొన్న త‌రుణాన అటు తెలంగాణ‌కు, ఇటు ఆంధ్రాకు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తేల్చుకోలేని స్థితిలోనో, త‌రుణానో చంద్ర‌బాబు ఆ విధంగా త‌మ‌కు రెండు ప్రాంతాలూ రెండు క‌ళ్ల‌తో స‌మానం అని చెప్పారు.

ఓ విధంగా ఆ రోజు వైసీపీ కూడా ఏమీ తేల్చుకోలేక‌పోయింది. ఇప్పుడు తెలంగాణ‌లో ఆ రెండు పార్టీలూ లేవు. వైసీపీ క‌న్నా ప్రయ‌త్నిస్తే టీడీపీ బాగానే అక్క‌డ పుంజుకోగ‌ల‌దు. ఎందుకంటే క‌మ్మ సామాజిక‌వ‌ర్గం ఓట్లు బాగానే ఇవాళ్టికీ టీడీపీ కి ప‌డ‌తాయి క‌నుక ! అయితే రెడ్లు కూడా టీడీపీలో పెద్ద‌గా చెడింది లేదు. ఎన్టీఆర్ కానీ చంద్ర‌బాబు కానీ రెడ్ల‌ను అణ‌గ‌దొక్క‌లేదు.

కానీ జ‌గ‌న్ ద‌గ్గ‌ర క‌మ్మ‌ల‌కు అస్స‌లు ప్రాధాన్యం లేకుండా పోతోంది. ఈ నేప‌థ్యంలో చూసినా, ఏ నేప‌థ్యాన్ని విశ్లేషించినా ఆ రోజు రుజువ‌ర్త‌న దిశ‌లో ఏ పార్టీ నాయ‌కుడూ ఆలోచించ‌లేదు. ఎందుక‌నో ఇవాళ ఇన్నాళ్ల‌కు రెండు క‌ళ్ల సిద్ధాంతం అన్న‌ది ఒక‌టి పుట్టుకు వ‌చ్చి ఉంటుంది మ‌ళ్లీ.

విద్య, వైద్య రంగాల‌కు త‌మ ప్ర‌భుత్వం మంచి ప్రాధాన్యం ఇస్తుంద‌ని అంటున్నారు బొత్స. ఇదే స‌మ‌యాన త‌మ‌కు ఆ రెండు రంగాల‌కూ ప్రాధాన్య రంగాలే అని తేల్చేశారు. అయితే బ‌డ్జెట్ కేటాయింపులు బాగానే ఉన్నా, సంబంధిత శాఖ‌ల‌కు ద‌క్కుతున్న‌దెంత..? అవి అభివృద్ధి చెందుతున్న‌దెంత ? అన్న‌దే ఇవాళ ఓ ప్ర‌శ్నార్థ‌క స‌మ‌యం. మ‌రియు సంద‌ర్భం కూడా ! నాడు నేడు కొన్ని పాఠ‌శాల‌ల‌కే క‌నుక మిగ‌తా బ‌డులు ఇంకా రూపుదిద్దుకోవాల్సి ఉంది. విద్యా రంగంలో ఖాళీల భ‌ర్తీకి అంటే ఇప్ప‌టిదాకా ఒక్క‌టంటే ఒక్క డీఎస్సీ పై కూడా ప్ర‌క‌ట‌న లేదు.కొన్ని చోట్ల పాఠ‌శాల‌ల విలీనం అన్న‌ది వివాదాస్ప‌దం అవుతోంది.


ఇంగ్లీషు మీడియం చ‌దువులు అన్నింటా ఒకేవిధంగా కొన‌సాగ‌డం లేదు. ఇదే సంద‌ర్భాన కొన్ని బ‌డుల మూత‌తో డ్రాపౌట్లు పెరిగిపోతున్నారు. వీట‌న్నింటినీ ప‌రిగ‌ణించ‌కుండా విద్య‌కు స‌మున్న‌త ప్రాధాన్యం ఇస్తున్నాం అని చెప్ప‌డం త‌ప్పు. ఇక వైద్య ఆరోగ్య శాఖ‌లోనూ ఇదే విధంగా త‌ప్పిదాలు ఉన్నాయి.. ఇంతే స్థాయిలో స‌మ‌స్య‌లూ ఉన్నాయి. వీటిపై కూడా మాట్లాడితే మేలు.