Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తి ఉద్య‌మంపై బొత్స మ‌ళ్లీ పేల్చారుగా..!

By:  Tupaki Desk   |   5 Nov 2021 4:10 PM GMT
అమ‌రావ‌తి ఉద్య‌మంపై బొత్స మ‌ళ్లీ పేల్చారుగా..!
X
ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ఉద్య‌మం నెల‌ల త‌ర‌బ‌డి కొన‌సాగుతూనే ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు ఇది అలా కంటిన్యూ అయ్యేలా ఉంది. ఈ ఉద్య‌మంపై వైసీపీకి చెందిన మంత్రులు, నేత‌లు సెటైర్లు వేస్తూనే ఉన్నారు. ఇక సీనియ‌ర్ నేత‌, మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అయితే అమ‌రావ‌తి ఉద్య‌మంపై ఏదో ఒక కాంట్రవ‌ర్సీ వ్యాఖ్య చేస్తూ వార్త‌ల్లో ఉంటున్నారు. బొత్స‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నా కూడా ఆయ‌న మాత్రం ఈ విష‌యంలో వెన‌క్కు త‌గ్గ‌డం లేదు. తాజాగా అమ‌రావ‌తి రైతులు న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో తిరుప‌తి వ‌ర‌కు పాద‌యాత్ర చేస్తున్నారు. ఈ పాద‌యాత్ర ఇప్పటికే ప్ర‌కాశం జిల్లాలోకి ప్ర‌వేశించింది. దీనికి ప్ర‌భుత్వం ప‌ర్మిష‌న్ ఇవ్వ‌క‌పోయినా కూడా రైతులు హైకోర్టును ఆశ్ర‌యించి మ‌రీ ప‌ర్మిష‌న్ తెచ్చుకున్నారు.

అక్క‌డ ఉద్య‌మం చేస్తోంది రాజ‌ధాని రైతులు కాద‌ని.. కేవ‌లం టీడీపీ కార్య‌క‌ర్త‌లే అని బొత్స ఎద్దేవా చేవారు. ప్ర‌తిప‌క్షాలు అమ‌రావ‌తి ఉద్య‌మంపై చేసే త‌ప్పుడు ప్ర‌చారం న‌మ్మ‌వ‌ద్ద‌ని ఆయ‌న ప్ర‌జ‌ల‌కు హిత‌వు ప‌లికారు. ఏ విష‌యంలో అయినా నిర‌స‌న తెలిపే హ‌క్కు ప్ర‌తి ఒక్క‌రికి ఉంటుంద‌ని.. కానీ పోలీసుల‌పై రాళ్లు వేసే సంస్కృతి స‌రికాద‌ని బొత్స చెప్పారు. చంద్ర‌బాబు రాజ‌కీయ ల‌బ్ధి కోస‌మే రైతుల‌ను అడ్డం పెట్టుకుంటున్నార‌ని.. గంజాయి పై  మాట్లాడే హ‌క్కు చంద్ర‌బాబుకు లేద‌న్నారు.

ఇక ఎన్‌సీపీ సుగ‌ర్స్ రైతుల‌కు బ‌కాయిలు ప‌డ‌డంతో ఆ ఫ్యాక్టరీకి చెందిన 24 ఎక‌రాల‌ను వేలం వేసి ఆ సొమ్ముతో బ‌కాయిలు చెల్లిస్తామ‌ని బొత్స చెప్పారు. అవ‌స‌ర‌మైతే ఎన్‌సీపీ సుగ‌ర్స్‌పై ఆర్ ఆర్ యాక్ట్ ప్ర‌యోగించేందుకు కూడా తాము వెనుకాడ‌మ‌ని బొత్స చెప్పారు. త‌మ‌ది రైతు ప‌క్ష పాత ప్ర‌భుత్వం అని చెప్పిన బొత్స ఎన్‌సీపీ సుగ‌ర్స్ విష‌యంలో 2015 నుంచి పేరుకుపోయిన రూ.27.80 కోట్ల బ‌కాయిల‌ను ప్ర‌భుత్వ‌మే ఫ్యాక్ట‌రీ భూములు అమ్మీ మ‌రీ చెల్లించింద‌ని.. మ‌రో రు. 16 కోట్ల బ‌కాయిలు ఉన్నాయ‌ని.. వాటిని కూడా అణాపైసాతో స‌హా చెల్లించే విష‌యంలో త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని చెప్పారు.  ఏదేమైనా మ‌రోసారి బొత్స అమ‌రావ‌తి ఉద్య‌మాన్ని టార్గెట్ చేశారు. మ‌రి దీనిపై విప‌క్షాలు, అక్క‌డ ఉద్య‌మ‌నేత‌ల నుంచి ఎలాంటి రిటాక్ట్ వ‌స్తుందో ?  చూడాలి.