Begin typing your search above and press return to search.
ఆ రెండింటిలోనూ చేరరట
By: Tupaki Desk | 13 April 2015 7:47 PM GMTకాంగ్రెస్ పార్టీలో ఓ చక్రం తిప్పిన బత్ససత్తిబాబు మీద ఊహాగానాలు ఈ మధ్యన ఎక్కువైపోయాయి. విభజన నేపథ్యంలో.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా మారిపోవటం.. సత్తిబాబు పెద్దగా పట్టకుండా ఉండటంతో పుకార్లు షికార్లు చేసే పరిస్థితి. దీనికితోడు ఆయను సన్నిహితంగా ఉండే వారు కొందరు సత్తిబాబు రాజకీయ భవిష్యత్తు మీద పలు వాదనలు తీసుకురావటం.. అవి కాస్తా బయటకు పొక్కుతున్న పరిస్థితి.
ఆ మధ్యన బీజేపీలో చేరతారన్న హడావుడి జరిగిన తర్వాత.. తాను పార్టీ మారటం లేదని.. కాంగ్రెస్‌కు విధేయుడిగానే ఉంటానని.. పార్టీ మారే ఆలోచనల లేదని చెప్పటం తెలిసిందే. రీసెంట్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాలన్న ఆలోచన చేస్తున్నారని.. ఇందుకోసం ప్రయత్నాలు మొదలుపెట్టారని.. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలతో ఆయన సమాలోచనలు చేస్తున్నారన్న వాదనలు జోరందుకున్నాయి.
ఈసారి ఏమనుకున్నారో ఏమో కానీ.. వెనువెంటనే స్పందించారు. తాను బీజేపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచనలో లేనట్లు చెప్పారు. అసలు ఇలాంటి పుకార్లు ఎలా పుడతాయో కూడా తనకు అర్థం కావటం లేదని వాపోయారు. తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని.. పార్టీలు మారే ఆలోచన లేనట్లు తేల్చేశారు.