Begin typing your search above and press return to search.
బొత్స పిలుపు ఇస్తే...బాబు స్పందించారు
By: Tupaki Desk | 15 Feb 2017 4:39 AM GMTఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత - మాజీమంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధన విషయంలో తమతో కలసొచ్చే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని పోరాడేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఈనెల 16న గుంటూరులో పార్టీ అధినేత జగన్ యువభేరి ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో బొత్స మీడియాతో మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అయినా, మరే ఇతర రాజకీయ పార్టీలయినా హోదా విషయంలో కలసి పనిచేస్తామని చెప్పారు. ఢిల్లీలో ధర్నా నిర్వహించినప్పటి నుంచి అనేక ప్రాంతాల్లో జగన్ ప్రత్యేక హోదా అంశంలో రాజీలేని పోరాటం చేస్తున్నారని బొత్స సత్యనారాయణ తెలిపారు.
ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలంటే ప్రతి విద్యార్థి - యువజనులు తలచుకుంటేనే సాధ్యపడుతుందన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 16న గుంటూరు నల్లపాడులో యువభేరి సదస్సుకు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. తమ పార్టీ ఎమ్మెల్యే రోజాను నిర్బంధించడంపై బొత్స స్పందిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం మహిళలను ఏ రకంగా వేధింపులకు గురిచేస్తుందీ ఈ ఉదంతం తేటతెల్లం చేస్తోందని బొత్స విమర్శించారు. మహిళా పార్లమెంటేరియన్ ను పేరుతో ఓ మహిళా ఎమ్మెల్యే పట్ల అవమానకరంగా ప్రవర్తించటం, వేధింపులకు గురిచేయటం అటు పోలీసులు, ఇటు ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాదరావు మహిళా పార్లమెంట్ ను తమ జేబులో డబ్బుతో నిర్వహించారనే ఫీలింగ్ ఇస్తున్నారని దుయ్యబట్టారు. ఇది అక్షరాల ప్రజల సొత్తని బొత్స అన్నారు.
కాగా, ఏపీ ఎన్జీవో సంఘం అశోక్ బాబు సైతం ఇదే రీతిలో రియాక్టయ్యారు. రాజకీయాలకు అతీతంగా పార్లమెంట్ సభ్యులు - శాసనసభ్యులతోపాటు అన్ని రాజకీయ పక్షాలు కలిసి ప్రత్యేక హోదాకోసం పోరాటం చేయగలిగితే భేషరతుగా మద్దతు ఇస్తుందని ఏపీ ఎన్జీవో సంఘానికి రెండోదఫా అధ్యక్షునిగా ఎన్నికైన అశోక్ బాబు చెప్పారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలకపాత్ర వహించిన ఎన్జీవో సంఘం ప్రత్యేక హోదా ఉద్యమానికి దూరంగా ఉండటాన్ని ప్రస్తావించినప్పుడు ఆయన స్పందించారు.అప్పటి పరిస్థితులు వేరుగా ఉన్నాయని, ప్రభుత్వం అంటూ లేదన్నారు. అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం కూడా సందిగ్ధావస్థలో ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని భుజస్కంధాలపై ఎత్తుకోవాల్సి వచ్చిందని అశోక్ బాబు చెప్పారు. సమ్మె విరమణ అనంతరం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాము ఎన్ని ఇబ్బందులు పడ్డామో తమకే తెలుసన్నారు. ప్రధానంగా సమ్మెకాలం జీతాలకోసం ఎంతగానో పోరాడాల్సి వచ్చిందని ఆయన వాపోయారు. ఇక ప్రత్యేక హోదాకు, ప్రత్యేక ప్యాకేజీకి ఉన్న వ్యత్యాసాన్ని, అలాగే లాభనష్టాలను బేరీజు వేసుకోవాల్సి ఉందని అశోక్ బాబు అన్నారు. ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి నష్టమని అన్ని పక్షాలు భావించి కేంద్రంపై పోరాడే పరిస్థితి వచ్చినప్పుడు తాము కూడా మద్దతునిస్తామని అశోక్ బాబు స్పష్టం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/