Begin typing your search above and press return to search.
చంద్రబాబును అనేంత సీన్ .. బొత్సకు లేదా?
By: Tupaki Desk | 27 May 2022 10:30 AM GMTరాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు కామనే. అయితే.. నాయకులు ఎవరైనా.. తమ స్థాయిని గుర్తించాలి. తమకు స్థాయి ఉందో లేదో తెలుసుకుని.. ఎదుటి పక్షంపై విమర్శలు చేయొచ్చు. కానీ, స్థాయిని మరిచి మరీ .. విమర్శలు చేయడం ఎప్పటికీ.. తగదు. ఇప్పుడు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విషయంలోనూ ఇదే తరహా చర్చ సాగుతోంది. ఆయన స్థాయిని మరిచి.. మరి.. టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్నారని.. రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
తాజాగా టీడీపీ మహానాడు ప్రారంభమైంది. మూడేళ్ల తర్వాత... ఘనంగా నిర్వహిస్తున్న మహానాడుపై.. మం త్రి బొత్స విమర్శలు చేశారు. మామకు తద్దినం పెట్టి.. మహానాడు చేసుకుంటున్నారంటూ.. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ అధినేత సీఎం జగన్ ఆదేశాల నేపథ్యంలో.. మంత్రులు బస్సు యా త్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బొత్స.. చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. అయితే.. ఈ వ్యాఖ్యలపై.. విశ్లేషకులు.. సహా రాజకీయ మేధావులు.. బొత్సకు కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు.
మంత్రి బొత్స వ్యాఖ్యలు.. గురివింద గింజ నీతుల్లా ఉన్నాయని అంటున్నారు. బొత్స తన గతం మరిచిపో తున్నారని.. అంటున్నారు. గతంలో కాంగ్రెస్‌పార్టీలో ఉన్న బొత్స.. ఆ పార్టీకి బై చెప్పి వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బొత్సకు ఏం తక్కువ చేసిందని ప్రశ్నిస్తున్నారు.
పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ఉమ్మడి ఏపీలో మంత్రి పదవి ఇచ్చింది. అదేవిధంగా ఉమ్మడిరాష్ట్రానికి కాంగ్రెస్ చీఫ్ కూడా చేసింది. ఇక, పార్టీలో ఎంతో మంది మేధావులు ఉన్నప్పటికీ.. ఎన్నికల కమిటీలోనూ కీలక బాధ్యతలు అప్పగించింది.
అంతేకాదు.. బొత్సకు మంత్రి పదవి తో పాటు.. ఆయన భార్యకు ఎంపీ టికెట్ కూడాఇచ్చిన విషయాన్ని మేధావులు గుర్తు చేస్తున్నారు. ఇక, బొత్స కుటుంబంలో నలుగురికి కూడా కాంగ్రెస్ పార్టీ ఆశ్రయం కల్పించింది. మరి కాంగ్రెస్ పార్టీలో ఇన్ని పదవులు అప్పగించిన తర్వాత కూడా.. బొత్స ఏం చేశారు.
ఆ పార్టీకి తద్దినం పెట్టలేదా? ఆ పార్టీ ఇప్పుడు కష్టాల్లో ఉంటే.. వదిలేసి వచ్చి.. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పార్టీ పెట్టిన.. ఆ పార్టీని దాదాపు భూస్థాపితం చేసిన వైసీపీ అధినేత జగన్తో చేతులు కలపలేదా? మరి దీనిని ఏమంటారు? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా.. ఎవరు చేసిన తప్పులు వారు.. తెలుసుకుంటే.. మంచిదని సూచిస్తున్నారు.