Begin typing your search above and press return to search.
బొత్స సంచలనం: ఏ క్షణమైనా విశాఖకు రాజధాని
By: Tupaki Desk | 29 March 2021 4:09 AM GMTపరిపాలనా రాజధానిని ఏ క్షణమైనా విశాఖకు తరలిస్తామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖనే ఏపీ రాజధానిగా ఉంటుందని ఆయన కుండబద్దలు కొట్టారు. బొత్స వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
రాష్ట్ర సమగ్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని.. అన్ని ప్రాంతాల ప్రజలను సమానంగా అభివృద్ధి చేయడమే తమ కర్తవ్యమన్నారు. అందుకే విశాఖకు రాజధాని తరలించి ఉత్తరాంధ్ర వెనుకబాటును సరిదిద్దుతామని బొత్స అన్నారు.
తెలుగుదేశం పార్టీ మూడు రాజధానులపై కోర్టుకు వెళ్లి అభివృద్ధిని అడ్డుకుంటోదని బొత్స ఆరోపించారు. మూడు రాజధానులపై ఇప్పటికే చట్టం చేశామని.. కోర్టులో చిన్న చిన్న సమస్యలున్నాయని.. న్యాయస్థానాలను ఒప్పించి.. మెప్పిస్తామని మంత్రి మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు.
ఒక వర్గానికి.. 20 గ్రామాలకే అమరావతి రాజధాని అని.. సీఎం జగన్ 13 జిల్లాల అభివృద్ధి కోసమే విశాఖకు పరిపాలన రాజధాని, అమరావతిలో లెజిస్లేటివ్ రాజధాని, కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారని మంత్రి వ్యాఖ్యానించారు.
జడ్పీటీసీ, ఎంపీటీసీ సహకార ఎన్నికలతోపాటు మిగతా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.
ఇక ఈనెల 31, ఏప్రిల్ 1న మున్సిపల్ చైర్మన్లు, మేయర్లకు శిక్షణ కార్యక్రమం ఉంటుందని బొత్స తెలిపారు.