Begin typing your search above and press return to search.
కాలేజీల్లో రెచ్చిపోతున్న బౌన్సర్లు
By: Tupaki Desk | 24 Feb 2018 12:15 AM GMTకాలేజీల్లో బౌన్సర్లు రెచ్చిపోతున్నారు. విద్యార్ధులపై దాడు చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. సాదారణంగా బౌన్సర్లంటే హీరోయిన్లు షాపింగ్ ఓపెనింగ్ సమయాల్లో - ఆడియో ఫంక్షన్ లలో ఆడియన్స్ ను అదుపు చేసేందుకు బౌన్సర్లను నియమిస్తారు.అయితే హైదరాబాద్ కు చెందిన కొన్ని కాలేజీలు విద్యార్ధులను డిసిప్లినరీ ఫోర్స్ కింద బౌన్సర్లను నియమించుకుంది. ఇప్పుడు ఆ బౌన్సర్లను విద్యార్ధులను చితకబాదడం వివాదాస్పదమైంది.
పోచంపల్లి సెయింట్ మేరిస్ కాలేజీలో బౌన్సర్లు విద్యార్ధుల్ని డిసిప్లినరీ పేరుతో బీర్ పురా ప్రాంతానికి చెందిన సోహిల్ - గులాం ఇస్మాయిల్ అనే ఇద్దరు యువకులను ప్రైవేటు బౌన్సర్లు చితకబాడదంతో తీవ్రగాయాలయ్యాయి. అయితే ఈ విషయం బయటకు చెబితే మీ అంతుచూస్తామని బెదిరించారు. ఆ బెదిరింపులకు భయపడ్డ విద్యార్ధులు సైలెంట్ అయ్యారు. కానీ తమ పిల్లలకు గాయాలయ్యాయని సంబంధిత కాలేజీ యాజమన్యాలపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు పోలీసుకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉంటే విద్యార్ధుల్ని క్రమశిక్షణలో పెట్టేందుకు బౌన్సర్లను ఎందుకు నియమించారంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
ఈ ఘటనపై మాట్లాడిన విద్యార్థులు కాలేజీల్లో రౌడీ షీటర్లను బౌన్సర్లుగా నియమించారని వాపోతున్నారు. వారు తమని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరుగకుండా పోలీసులు రౌడీ బౌన్సర్లపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.