Begin typing your search above and press return to search.
హైదరాబాద్ లో బాంబ్ కలకలం..పోలీసుల క్లారిటీ
By: Tupaki Desk | 8 Sep 2019 8:29 AM GMTహైదరాబాద్ లో బాంబ్ పేలిందంటూ కలకలం చెలరేగింది. ఒక్కరోజు కనుక ముందు ఈ పేలుడు జరిగి ఉంటే భారీ ప్రాణనష్టం సంభవించేది. తాజాగా జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడి సీరియస్ గా ఉన్నట్టు తెలిసింది.
హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో గల పీవీ నరసింహరావు ఎక్స్ ప్రెస్ వే 279 పిల్లర్ వద్ద ఈ బాంబు పేలుడు సంభవించింది. ఫుట్ పాత్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఒక కవర్ ను చెత్త సేకరించే అలీ అనే వ్యక్తి తెరుస్తుండగా బాంబ్ పేలింది. పేలుడు ధాటికి అలీ చేతులు ఛిధ్రమయ్యాయి. ఆ చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది.
బాంబు పేలడంతో గుర్తించిన స్థానికులు అతడిని వెంటనే 108లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
కాగా నిన్న రాత్రే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున వినాయక నిమజ్జన ఊరేగింపు జరిగింది. పేలుడు నిన్న రాత్రి జరిగి ఉంటే ఊహించని నష్టం చోటుచేసుకునేదని పోలీసులు చెబుతున్నారు. ఇందులో ఉగ్రకోణం ఉందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని హుటాహుటిన బాంబ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేశారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించారు. చెత్తలో ఉన్న బాక్సును తెరవడం వల్లే ఈ పేలుడు సంభవించిందని తెలిపారు.
అయితే పోలీసుల పరిశోధనలో ఈ పేలుడుకు బాంబ్ కారణం కాదని పోలీసులు తేల్చారు. ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపంగా కెమికల్ కారణంగానే పేలుడు సంభవించినట్టు పోలీసులు తెలిపారు.అలీ అనే వ్యక్తి పేలుడు స్వభావంగల కెమికల్ ను ఒక్కసారిగా తెరవడంతో అది పేలిందని పేర్కొన్నారు.