Begin typing your search above and press return to search.

21ఏళ్ల యువతికి ఆరోతరగతి బాలుడి వేధింపులు

By:  Tupaki Desk   |   22 May 2020 9:30 PM GMT
21ఏళ్ల యువతికి ఆరోతరగతి బాలుడి వేధింపులు
X
పదోతరగతికే ప్రేమాయణాలు మొదలవుతున్నాయని ఇన్నాళ్లు చదివాం..చూశాం.. కానీ ఆరో తరగతి నుంచే ఈ బుడ్డోడు చెడుగుడు ఆడడం మొదలెట్టేశాడు. ఏకంగా 21 ఏళ్ల యువతికి వలవేశాడు.. ఆమెకు మార్ఫింగ్ ఫొటోలు పంపి లైంగికంగా వేధించాడు. సెక్స్ చాట్ చేస్తావా లేదా అని బెదిరించాడు. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఆరో తరగతి చదవే విద్యార్థి ఏకంగా 21 ఏళ్ల యువతిని లైంగికంగా వేధించిన తీరు సంచలనంగా మారింది.

ఘజియాబాద్ లో బాధిత యువతి, 6వ తరగతి విద్యార్థి కలిసి ఓ టెలిగ్రామ్ గ్రూపులో సభ్యులు. ఓ స్కూల్ విద్యార్థులు క్రియేట్ చేసిన గ్రూప్ ఇదీ. విద్యార్థుల సందేహాలు ఇందులో నివృత్తి చేసుకోవచ్చు. బాగా చదువుకునేందుకు టీచర్లు, విద్యార్థులకు ఈ గ్రూప్ సాయం చేస్తుంటుంది.

ఈ క్రమంలోనే బీఎస్సీ పూర్తి చేసి సివిల్స్ ప్రిపేర్ అవుతున్న యువతి కూడా ఈ గ్రూపులో జాయిన్ అయ్యింది. 6వ తరగతి విద్యార్థి ఈమెతో చనువు పెంచుకొని చదువు గురించి సందేహాలు తీర్చుకునేవాడు. బాగా పరిచయం అయ్యాక ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.

ఈనెల 17న ఉదయం 3.30 గంటలకు సదురు పిల్లాడు.. ఆ యువతి మొబైల్ కు ఆమె న్యూడ్ మార్ఫింగ్ ఫొటోలు పంపించాడు. అది చూసి షాక్ అయిన యువతి కి వెంటనే ఫోన్ చేసి తనకు డబ్బైనా ఇవ్వాలని.. లేదంటే సెక్స్ చాట్ చేయాలని.. లేకుంటే నీ న్యూడ్ మార్పింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో పెడుతానని బెదిరించాడు.

6వ తరగతి విద్యార్థి చేసిన పనికి షాక్ అయిన యువతి తన తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పింది. వారు విద్యార్థిని పిలిపించి బెదిరించినా అతడి వేధింపులు ఆగలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు విచారించగా.. తనకు ఏం తెలియదని.. తన ఫోన్ ను ఎవరో హ్యాక్ చేసి ఆమెకు ఈ ఫొటోలు పంపారని 6వ తరగతి పిల్లాడు సమాధానమిచ్చాడు. దీనిపై సైబర్ టీంను సంప్రదించి ఎవరు పంపారనే విషయమై పోలీసులు ఆరాతీస్తున్నారు. 6వ తరగతి పిల్లాడికి ఫోన్ ఇచ్చిన తల్లిదండ్రులకు పోలీసులు చీవాట్లు పెట్టి హెచ్చరించారు.