Begin typing your search above and press return to search.
పబ్జీ ఆడవద్దన్నందుకు తల్లిని కాల్చి చంపిన బాలుడు
By: Tupaki Desk | 9 Jun 2022 1:30 AM GMTఈ కాలం పిల్లలు సెల్ ఫోన్లకు బానిసలయ్యారు. మొబైల్ గేమ్స్ కు బాగా అలవాటు పడ్డారు. చేతికి సెల్ ఫోన్ ఇస్తే చాలు రోజంతా ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ గడిపేస్తున్నారు. మొదట సరదాగా మొదలై ఆ తర్వాత వ్యసనంగా మారే ఈ గేమ్ ఇప్పుడు వారికే కాదు.. వారి తల్లిదండ్రుల పాలిట కూడా మరణశాసనంగా నిలుస్తోంది.
చేతికి సెల్ ఫోన్ ఇస్తే చాలు రోజంతా ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ గడిపేస్తున్నారు. మొదట సరదాగా మొదలై ఆ తర్వాత వ్యసనంగా మారే ఈ అలవాటు కొంతమంది ప్రాణాల మీదకు తెస్తోంది. తిండి తిప్పలు మానేసి గంటల కొద్దీ గేమ్స్ ఆడుతూ అనారోగ్యం పాలవుతున్నారు.
ఇలాగే పబ్ జీ గేమ్ కు బానిసైన ఓ బాలుడు ఏకంగా తన తల్లిని చంపేశాడు. పబ్ జీ గేమ్ ఆడకుండా అడ్డుకున్ంనదుకు ఆమెను గన్ తో కాల్చి చంపాడు. ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఈ ఘోరం జరిగింది.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని పీజీఐ ప్రాంతంలో సాధన అనే మహిళ.. తన 16 ఏళ్ల కొడుకు , 10 ఏళ్ల కుమార్తెతో కలిసి జీవిస్తోంది. ఆమె భర్త ఆర్మీలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం కోల్ కతాలో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో కుటుంబ బాధ్యత అంతా ఆమె చూసుకునేది. సాధన కుమారుడు పబ్ జీ గేమ్ కు బానిసైపోయాడు. దీంతో ఆ అలవాటును మానుకోవాలని కుమారుడిని సాధన పలుసార్లు హెచ్చరించింది. తరచూ తనను ఆడుకోకుండా చేస్తున్న తల్లిపై కోపం పెంచుకున్నాడు.
శనివారం రాత్రి ఆమె నిద్రిస్తున్న సమయంలో తన తండ్రి లైసెన్స్ తుపాకీతో ఆమెను కాల్చిచంపాడు. ఆ తర్వాత మూడు రోజుల పాటు తల్లి శవాన్ని ఇంట్లోనే దాచాడు. మృతదేహం దుర్వాసన రాకుండా గదుల్లో రోజూ రూమ్ ఫ్రెష్ నర్లను స్ప్రే చేశాడు. తన తల్లి అమ్మమ్మ దగ్గరకు వెళ్లిందని చెప్పి నమ్మించాడు.
మంగళవారం రాత్రి 8 గంటలకు తన తండ్రికి ఫోన్ చేసి ఇంట్లో రిపేర్ చేయడానికి వచ్చిన ఎలక్ట్రీషన్ మా అమ్మను చంపాడని చెప్పాడు. ఇదే విషయాన్ని అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
బాలుడి కట్టుకథను పోలీసులకు చెప్పాడు. ఎలక్ట్రీషన్ హత్య చేశాడని పోలీసులను తప్పుదోవ పట్టించాడు. పోలీసులకు అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించగా బాలుడు నేరం అంగీకరించక తప్పలేదు.