Begin typing your search above and press return to search.

యువరాణితో హగ్.. ఏమనుకోవద్దంటూ యువరాజుకు లేఖ

By:  Tupaki Desk   |   9 March 2020 3:30 PM GMT
యువరాణితో హగ్.. ఏమనుకోవద్దంటూ యువరాజుకు లేఖ
X
ఆమె యువరాణి. అతగాడు చాలా చిన్న కుర్రాడు. ఆ మాటకు వస్తే.. ఆ దేశంలో ఆ కుర్రాడు లాంటి కాలేజీ స్కూలు పిల్లలు లక్షల్లో ఉంటారు. అలాంటిది ఆ కుర్రాడు ఇప్పుడు పాపులర్ అయ్యాడు. ఎందుకంటారా? సదరు యువరాణి ఇంప్రెస్ అయి.. ఆ కుర్రాడిని చిన్న కౌగిలితో ప్రశంసించటమే దీనికి కారణం. స్కూల్ కుర్రాడేంది? యువరాణి హగ్ ఇవ్వటం ఏమిటి? కన్ఫ్యూజన్ గా అనిపిస్తుందా? ఓకే.. అసలు విషయం వివరంగా చెప్పుకొస్తాం.

బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ సతీమణి మేఘన్ మార్కెల్ తెలుసు కదా. ఉమెన్స్ డే సందర్భంగా లండన్ లోని ఒక స్కూల్ ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె ప్రసంగించకుండా.. విద్యార్థుల్లో ఎవరైనా వచ్చి మాట్లాడాలని.. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ప్రాధాన్యత గురించి మాట్లాడితే బాగుంటుందన్నారు.
యువరాణి మాటకు పిల్లలు ఎవరూ రియాక్ట్ కాలేదు. ఇలాంటి వేళ ఎకర్ ఒకోయి అనే విద్యార్థి ధైర్యం గా స్టేజి మీదకు వెళ్లాడు. మైకు దగ్గరకు వెళ్లాక.. మేఘన్ మార్కెల్ ఎంతో అందం గా ఉన్నారంటూ తన ప్రసంగాన్ని స్టార్ట్ చేశారు. ఒక స్కూల్ కుర్రాడు.. అది ఒక టీనేజర్ నోటి నుంచి వచ్చిన మాటలు ఒక ఎత్తు అయితే.. ఆ కుర్రాడి మాటలకు యువరాణి నవ్వు ఆపుకోలేకపోయారు.

ఎకర్ మాట్లాడటం పూర్తి కాగానే.. మేఘన్ తన ప్రోటోకాల్ ను పక్కన పెట్టి మరీ అతడ్ని ఆత్మీయం గా హగ్ చేసుకున్నారు. దీంతో.. అక్కడి వారు దీనికి ఆశ్చర్యపోయారు. ఇదిలా ఉంటే.. తాజాగా సదరు కుర్రాడు.. మేఘన్ భర్త కమ్ యువరాజు హ్యారీకి ఒక లేఖ రాశారు. మీ భార్యను కౌగిలించుకున్నందుకు మీరేమీ అనుకోరు కదా? దయచేసి నన్ను క్షమించండి.. ఆమెను చూడగానే భావోద్వేగానికి గురయ్యాను.. ఒకింత షాకింగ్ గా అనిపించింది. ఆమె మాటల్ని వినటం.. ఆమె ముందు మాట్లాడటం తనకెంతో ఆనందానికి గురి చేసిందంటూ పేర్కొన్నాడు. ఈ లేఖ ఇప్పుడు బయటకు రావటంతో.. ఈ స్కూల్ కుర్రాడు బ్రిటన్ వ్యాప్తంగా ఇప్పుడు ఫేమస్ అయిపోయాడు. మరీ.. లేఖకు ప్రిన్స్ హ్యారీ ఎలా రియాక్ట్ అవుతారో?