Begin typing your search above and press return to search.
ఆ బాలుడికి ప్రాణభిక్ష పెట్టిన తలైవా!
By: Tupaki Desk | 5 Sept 2018 1:20 PMతమ అభిమాన నటీనటుల సినిమాలు చూస్తూ తమను తాము మైమరచిపోయే అభిమానులు ఎందరో ఉన్నారు. తామ బాధల్లో ఉన్నపుడు తమకు నచ్చిన హీరోల సినిమాలు చూసి సాంత్వన పొందుతామని, ఆ బాధలను మరచిపోతామని వారు చెబుతుంటారు. అదే తరహాలో తాజాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ఓ బాలుడు....తన అభిమాన హీరో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలు చూసి కోలుకున్నాడు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోన్న ఆరేళ్ల బాలుడు....తలైవా సినిమాలు చూసి రికవర్ అయ్యాడు. స్వయంగా ఈ విషయాన్ని అతడికి చికిత్స చేసిన ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటన తాలూకు వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.
బెంగళూరులోని మూడలపాళ్యకు చెందిన కుశాల్ పుట్టుకతోనే డైలేటెడ్ కార్డియోమయోపతి వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ వ్యాధి వల్ల గుండె వీక్ అయ్యి రక్త సరఫరా నెమ్మదించింది. దీంతో, ఫోర్టిస్ ఆసుపత్రి సిబ్బంది, రెండు స్వచ్ఛంద సంస్థల సాయంతో కుశాల్ కు ఆగస్టు మొదటివారంలో గుండె మార్పిడి చికిత్స జరిగింది. ప్రమాదంలో చనిపోయిన ఓ వ్యక్తి గుండెను నిమిషాల వ్యవధిలో కుశాల్ కు అమర్చారు. చికిత్స పూర్తయిన తర్వాత ఆసుపత్రిలోని వార్డులో రజనీకాంత్ సినిమాలను కుశాల్ చూసేవాడు. తన ఫేవరెట్ స్టార్ తలైవా సినిమాలు చూసి కుశాల్ పూర్తిగా కోలుకున్నాడని, రజనీ సినిమాల వల్లే అది సాధ్యమైందని చికిత్స చేసిన ఫోర్టిస్ ఆస్పత్రి డైరెక్టర్ మురళి చక్రవర్తి మీడియాకు వెల్లడించారు.