Begin typing your search above and press return to search.
డాక్యుమెంటరీ శుద్ధ అబద్ధం-బోయపాటి
By: Tupaki Desk | 19 July 2015 7:59 AM GMTపుష్కరాల సందర్భంగా చంద్రబాబు మీద డాక్యుమెంటరీ తీశారని.. దానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడని.. ఆ షూటింగ్ సందర్భంగా చోటు చేసుకున్న గందరగోళం వల్లే తొక్కిసలాట జరిగి 29 మంది చనిపోయారని రెండు మూడు రోజులుగా మీడియాలో విస్తృతంగా వార్తలు వస్తున్నాయి. ఈ ఆరోపణల్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటికే దీనిపై తీవ్రంగా ఖండించారు. తాజాగా దర్శకుడు బోయపాటి శ్రీను కూడా దీనిపై స్పందించారు. ఈ ఆరోపణలు అర్థరహితమన్నాడు. సాక్షి టీవీ ఇంటర్వ్యూలో అసలు తానేం చేసింది స్పష్టంగా వివరించాడు బోయపాటి.
‘‘నేను సినిమా డైరెక్టర్ని కాబట్టి రంగుల్ని ఎలా ప్రెజెంట్ చేయాలన్నది పూర్తి అవగాహన ఉంది. పుష్కర ఘాట్లో హారతి మరింత బ్రైట్ గా ఉండేలా చూడటం కోసం చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిచి ఆ బాధ్యత అప్పగించారు. దీని వల్ల దేశం నలు మూలల నుంచి వస్తున్న యాత్రికులు హారతి చూసి గొప్ప అనుభూతి పొందుతున్నారు. నేను జులై 12న పుష్కర ఘాట్ కు వెళ్లాను. పరిసరాల్ని గమనించే ఏం చేయాలో ఆలోచించాను. అధికారుల సహకారంతో స్థానికంగా ఉన్న దుకాణాల నుంచి కావాల్సిన వస్తువులు కొన్నాం. గుంటూరు నుంచి గొడుగులు తెప్పించాం. హారతి అద్భుతంగా ఉండేలా తీర్చిదిద్దాం. ఈ ఏర్పాట్లు చూసి భక్తులు ఆనందించాలన్నదే మా ఉద్దేశం. చంద్రబాబు గారు నాకు చెప్పింది అదే. 14వ తారీఖు డాక్యుమెంటరీ తీయడం లాంటిదేమీ జరగలేదు. నిజానికి నాకు డాక్యుమెంటరీ తీసేంత టైం లేదు. నా పని హారతి బాగా వచ్చేలా చేయడం వరకే. జులై 13 రాత్రి నా పని పూర్తయింది. 14న ఉదయం ఏడున్నరకు గౌతమి ఘాట్లో పుష్కర స్నానం చేసి హైదరాబాద్‌కు బయల్దేరిపోయాను’’ అని బోయపాటి చెప్పాడు.