Begin typing your search above and press return to search.
వాటికోసం దిగజారి ప్రియురాలినే బ్లాక్ మెయిల్ చేశాడు
By: Tupaki Desk | 25 Nov 2019 5:32 AM GMTవిశాఖపట్నంకు చెందిన ఒక యువతి పోలీసు స్టేషన్ కు వెళ్లి తన ప్రియుడు ఈమద్య పదే పదే బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది. చాలా ఏళ్లుగా చాలా అన్యోన్యంగా ఉంటు వస్తున్నాం. త్వరలో పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. కాని ఇప్పుడు నన్ను డబ్బులివ్వమంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఇద్దరం కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఎంక్వౌరీ చేయగా ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఆమె ప్రియుడు గతంలో మంచి వాడుగానే ఉన్నా ఇప్పుడు డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు. మొదట్లో సరదాగా డ్రగ్స్ తీసుకున్న అతడు ఆ తర్వాత రెగ్యులర్ గా తీసుకోవడం మొదలు పెట్టాడు. డ్రగ్స్ కోసం తన వద్ద ఉన్నదంతా ఖర్చు పెట్టాడు. ఇంకా డ్రగ్స్ కోసం ప్రియురాలిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడట. డ్రగ్స్ కు బానిసైన విషయం ఆమెకు తెలియక పోవడంతో అతడి ప్రవర్తనకు కంగారు పడి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ఎంక్వౌరీ చేసి డ్రగ్స్ సరఫరా చేసిన వారి వివరాలను తీసుకున్నారు. వైజాగ్ కు చెందిన నలుగురి పేర్లను అతడు చెప్పాడు. పోలీసులు వారిని పట్టుకుని విచారించగా ముంబయి.. బెంగళూరు నుండి డ్రగ్స్ తీసుకు వచ్చి అమ్ముతున్నట్లుగా ఒప్పుకున్నారు. పలు కాలేజ్ లు మరియు ఇతర ప్రాంతాల్లో డ్రగ్స్ అమ్ముతున్నట్లుగా వారు పేర్కొన్నారు. మరో వైపు ఆ ప్రియుడిపై కేసు నమోదు చేసి హాస్పిటల్ కు తరలించారు.