Begin typing your search above and press return to search.
ప్రేయసి కోసం వెళ్తే దొంగనుకోగా.. ప్రియుడి ఆత్మహత్య
By: Tupaki Desk | 14 Sep 2020 11:30 PM GMTప్రేయసి కోసం వారింటికి వెళ్లగా.. ఆమె కనిపించలేదు. ఊర్లో వారు దొంగనుకుని అతడిని గదిలో పెట్టి తాళం వేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆలోగా అతడు ఆ ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆమెతో మాట్లాడడానికి గోపి పలుసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఆమె కోసం రెండు సార్లు ఆత్మహత్యకు కూడా యత్నించాడు. అతడి బెదిరింపులపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎలాగైనా సరే ప్రియురాలిని కలవాలని గోపి వాళ్ళ ఊరికి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్లగా ఎవరూ కనిపించలేదు. అయితే అతడు ఇంట్లోకి వెళ్లడం ఆ ఊరి వాళ్ళు చూశారు. ఎవరో దుండగుడు ప్రవేశించాడని భావించి గ్రామస్తులు అక్కడికి చేరుకొని ఇంటి బయట తలుపునకు గొళ్ళెం పెట్టారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. తాను దొంగను కాదని ఎంత మొత్తుకున్నా గ్రామస్తులు వినలేదు. ప్రేయసి మాట్లాడడం మానేయడం, పోలీసులు వస్తే దొరికి పోతానేమో అని భయపడ్డ గోపి ప్రియురాలి ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.