Begin typing your search above and press return to search.

లవర్ పెళ్లి ఆపాలని ప్రియడు ఏకంగా ఆ వీడియోను ... అందులో ఏముందంటే ?

By:  Tupaki Desk   |   15 July 2021 9:30 AM GMT
లవర్ పెళ్లి ఆపాలని ప్రియడు ఏకంగా ఆ వీడియోను ... అందులో ఏముందంటే ?
X
మనదేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచార కేసుల్లో నిందితులకు శిక్షలు పడుతున్నప్పటికీ, నిత్యం మహిళలపై అఘాయిత్యాలు, ఆత్యాచారాలు మాత్రం తగ్గటం లేదు. కొన్ని సంఘటనలు ఇలా ఉంటే ..మరికొన్నిఘటనలు మాత్రం మరోలా ఉంటున్నాయి. ప్రేమ పేరుతో ఇష్టం వచ్చినట్టు తిరగడం , ఆ తర్వాత నువ్వు అంటే ఇష్టం లేదు అని అమ్మాయి వేరే పెళ్లి కి సిద్ధం కాగానే , ఆ అమ్మాయికి సంబంధించిన ప్రైవేట్ వీడియోస్ ను సోషల్ మీడియా లో పెట్టేయడం. ప్రస్తుతం ఇదే జరుగుతుంది. ఈ సంఘటన కూడా ఇలాంటిదే. గతంలో ఇద్దరూ ప్రేమలో మునిగితేలిపోయారు.

ఫ్రీ టైం దొరికినప్పుడు కలిసి ఏకాంతంగా ఎక్కడికైనా వెళ్లేవారు. అలా ఒకసారి ఏకాంతంగా ఉన్న సమయంలో ఆ యువకుడి ఫ్రెండ్స్ నలుగురు ఆ అమ్మాయి పై గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారు. అయితే , కొన్ని కారణాల వల్ల ఆ విషయాన్ని అప్పుడు ఎవరికి చెప్పలేదు. అయితే , ఈ మధ్యనే ఆ యువతికి పెళ్లి ఫిక్స్ అయ్యింది. దీనితో తన ప్రియురాలు తనని మోసం చేసి , వేరే పెళ్లికి సిద్దపడటం తో ఆమెని గ్యాంగ్ రేప్ చేసిన సమయంలో తీసిన వీడియో ను సోషల్ మీడియా లో వైరల్ చేశాడు. దీనితో ఆ పెళ్లి పెటాకులైంది. గ్యాంగ్ రేప్ చేసిన నిందితుల్లో ఇద్దరు ఇప్పుడు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే ... బీహార్ లోని గోపాల్ గంజ్ సమీపంలోని కాటేయా పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న యువతికి వివాహం నిశ్చయం అయ్యింది. అమ్మాయి కుటుంబ సభ్యులు పెళ్లికి అన్ని సిద్ధం చేసుకుంటున్న సమయంలో పెళ్లి కూతురి గ్యాంగ్ రేప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. తన మీద అత్యాచారం చేసే సమయంలో వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్టు చేసి నా జీవితం నాశనం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ బాధితురాలు కాటేయా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది.

ఆ పెళ్లి కూతురు ఫిర్యాదు మేరకు ప్రియుడితో పాటుగా మరో నలుగురు నిందితుల మీద పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. ప్రియుడు అభిషేక్ శర్మ, అతని ప్రియురాలు వాళ్లకు టైమ్ చిక్కినప్పుడు బయటకు వెళ్లి ఏకాంతంగా గడిపారు. రెండేళ్ల కిందట ప్రేమికులు మంచి మూడ్ లో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో ప్రియుడుస్నేహితులు నలుగురు వచ్చి అభిషేక్ ను పక్కకులాగేసి ప్రియురాలి మీద ఆ నలుగురు గ్యాంగ్ రేప్ చేశారు. ఇదే సమయంలో ప్రియుడు ప్రియురాలి మీద రేప్ చేశాడని ఆరోపణలు ఉన్నాయి. గ్యాంగ్ రేప్ నిందితుల నుంచి ఆ అమ్మాయి ప్రాణాలతో బయటపడింది. గ్యాంగ్ రేప్ జరిగే సమయంలో అమ్మాయి వయసు 16 ఏళ్లు మాత్రమే.

ఈ సమయంలో నువ్వు గ్యాంగ్ రేప్ జరిగిందని కేసు పెడితే మనం కూడా చిక్కుళ్లో పడతామని, కేసు పెట్టకుండా సైలెంట్ గా ఉంటే మంచిది అని ప్రియుడు ప్రియురాలికి మాయమాటలు చెప్పాడు. దీనితో ఆ సమయంలో బాధితురాలు పోలీసు కేసు పెట్టలేదు. ఇప్పుడు అమ్మాయి పెళ్లి వేరే యువకుడితో ఫిక్స్ అయ్యింది. తనను మోసం చేసి ప్రియురాలు వేరే యువకుడిని వివాహం చేసుకుంటున్నదని ప్రియుడు అభిషేక్ రగిలిపోయాడు. తనను పెళ్లి చేసుకోవాలని అమ్మాయికి చెప్పాడు.

ఆ రోజు నా మీద గ్యాంగ్ రేప్ చేసినా నువ్వు ఏమాత్రం పట్టించుకోలేదని, గ్యాంగ్ రేప్ చేసిన వాళ్లతోనే కలిసి తిరుగుతున్నావని, నీలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే నా జీవితం ఇంకా నాశనం అవుతుందని పెళ్లి కి ఆ యువతి ఒప్పుకోలేదు. అమ్మాయి పెళ్లి నిలిపివేయాలని, ఆమె జీవితం నాశనం చెయ్యాలనే ఉద్దేశంతో రెండు సంవత్సరాల క్రితం గ్యాంగ్ రేప్ చేసే సమయంలో తీసిన వీడియోను ఆమె మాజీ ప్రియుడు ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడం కలకలం రేపింది.

అమ్మాయి పెళ్లి నిలిపివేయాలనే ఉద్దేశంతో మాజీ ప్రియుడు ఆమె గ్యాంగ్ రేప్ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో విపరీతంగా వైరల్ అయ్యింది. తన గ్యాంగ్ రేప్ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారని అమ్మాయికి తెలిసింది. బాధితురాలు కేసు పెట్టడంతో ఐదు మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో ఆమె మాజీ ప్రేమికుడు పరారీలో ఉన్నట్టు చెప్పారు. నిందితుల్లోని ఇద్దరూ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారని, వారిని భారత్ రప్పించడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు. ఈ గ్యాంగ్ రేప్ కేసు బీహార్ తో పాటు కేంద్ర హోమ్ శాఖ ముఖ్యకార్యదర్శికి, విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారుల వరకు వెళ్లడం బీహార్ లో సంచలనం సృష్టిస్తుంది.