Begin typing your search above and press return to search.
సోనూకు పద్మ విభూషణ్ ఇవ్వండి.. ఎవరు సిఫార్సు చేశారో తెలుసా?
By: Tupaki Desk | 12 Jun 2021 4:58 AM GMTకరోనా మొదటి దశ నుంచీ.. తన సేవాకార్యక్రమాలతో ఈ దేశపు నిజమైన హీరోగా వెలుగొందుతున్నాడు సోనూ సూద్. అధికారం చేతిలో ఉన్నవాళ్లు కరోనా బాధితుల గురించి పట్టించుకోవట్లేదని తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్న చోట.. సోనూ సూద్ సహాయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అతడే ఒక సైన్యంలా అందిస్తున్న సహకారానికి అందరూ ముగ్ధులవుతున్నారు. అలాంటి సోనూకు పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.
పలు రంగాల్లో విశిష్టమైన సేవలు అందించిన వారికి కేంద్ర ప్రభుత్వం ప్రతిఏటా పద్మవార్డులను ప్రకటిస్తుంది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది (2002) అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ మొదలైంది. సెప్టెంబర్ 15వ తేదీ వరకు సిఫార్సులకు అవకాశం ఉంది. https://padmaawards.gov.in లో వివరాలను అప్ లోడ్ చేయాల్సి ఉంది.
ఈ క్రమంలో దేశంలోని పలువురు ప్రముఖుల పేర్లను సిఫారసు చేస్తున్నారు. అయితే.. సోనూ సూద్ పేరు కూడా పద్మ అవార్డుకు నామినేట్ అయ్యింది. ఆయనకు పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందజేయాలని టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ కోరారు. ఈ మేరకు సోనూ పేరును బ్రహ్మాజీ నామినేట్ చేశారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించిన బ్రహ్మాజీ.. తన ప్రతిపాదనను సమర్థించేవారంతా రీ-ట్వీట్ చేయాలని కోరారు. దీంతో చాలా మంది రీట్వీట్లు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సోనూ సూద్ స్పందించాడు. ‘‘135 కోట్ల మంది భారతీయుల ప్రేమ, అభిమానమే పెద్ద అవార్డు. దాన్ని ఇప్పటికే పొందాను. మీ అభిమానానికి ధన్యవాదాలు’’అంటూ పోస్టు చేశాడు. పలువురు నెటిజన్లు మాత్రం సోనూకు పద్మపురస్కారం ఇవ్వాలని కోరుతున్నారు.