Begin typing your search above and press return to search.
చనిపోయి 117 రోజులకు బిడ్డకు జన్మనిచ్చింది
By: Tupaki Desk | 6 Sep 2019 1:30 AM GMTఓవైపు విషాదం.. ఓవైపు సంతోషం.. తల్లి చనిపోయింది. కానీ బిడ్డ బతికింది. ఐతే ఇది కాన్పులో సమస్య వచ్చి తల్లి మరణించిన ఉదంతం కాదు. బ్రెయిన్ డెడ్ అయిన ఓ గర్భవతి 117 రోజుల తర్వాత బిడ్డను ప్రసవించడం గమనార్హం. ఇది వైద్య చరిత్రలోనే అత్యంత అరుదైన ఘటనల్లో ఒకటిగా చెప్పొచ్చు. ఇది యూరప్‌లోని జెఖియా అనే దేశంలో జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్లో ఆ దేశానికి చెందిన 27 ఏళ్ల యువతి తీవ్ర అనారోగ్యం పాలైంది. ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆమెను ఎయిర్ ఆంబులెన్స్ ద్వారా వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ ఫలితం లేకపోయింది. బ్రెయిన్ హ్యామరేజ్ వల్ల.. ఆమె ప్రాణం కాపాడలేమని వైద్యులు తేల్చేశారు. ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్టు నిర్ధరించారు.
ఐతే అప్పటికే ఆ యువతి ఐదు నెలల గర్భవతి. కుటుంబసభ్యులకు ఏం చేయాలో తోచలేదు. ఎలాగైనా బిడ్డను కాపాడమని కోరడంతో ఆమెకు అప్పట్నుంచి చికిత్స అందిస్తున్నారు. తల్లి బ్రెయిన్ డెడ్ అయినా.. బిడ్డ ఆరోగ్యంగా ఉండటంతో.. ప్రత్యేకంగా ఓ గదిలో ఉంచి వైద్య బృందం చికిత్స కొనసాగించింది. బిడ్డ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వచ్చారు. అలా 117 రోజుల పాటు జాగ్రత్తగా బిడ్డను సంరక్షిస్తూ ఎదుగుదలను గమనిస్తూ వచ్చారు. ఆమె ఇటీవలే ఆడపిల్లకు జన్మనిచ్చింది. సిజేరియన్ చేసి డాక్టర్లు బిడ్డకు ప్రాణం పోశారు. 4.7 పౌండ్ల బరువుతో, 16.5 అంగుళాల పొడవుతో బిడ్డ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు. డెలివరీ కాగానే.. డాక్టర్లు ఆయువతికి లైఫ్ సపోర్ట్ తీసేశారు. బిడ్డ ప్రస్తుతం తండ్రి దగ్గరే ఉంది.