Begin typing your search above and press return to search.
మెదడు తినే అమీబా..బాలుడు మృతి, టెక్సాస్ లో అలెర్ట్!
By: Tupaki Desk | 1 Oct 2021 3:30 AM GMTకరోనా వైరస్ సృష్టించిన బీభత్సం నుంచి ప్రపంచం కోలుకోకముందే మరో సూక్ష్మజీవి ప్రజలను భయకంపితులను చేస్తోంది. నేరుగా మెదడుపై దాడి చేసి చంపేస్తోంది. అదే 'అమీబా నెగ్లేరియా ఫోవ్‌లేరి'..అమీబా జాతికి చెందిన సూక్ష్మజీవి. గతంలోనూ తన ప్రభావం చూపించిన ఆ క్రిమి.. తాజాగా మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఈ వైరాస్ శరీరంలోని మెదడుపై అటాక్ చేసి.. వ్యాధి గురించి తెలియకముందే ప్రాణాలను హరిస్తూ, ప్రజలను వణికిస్తోంది. అమెరికాలోని టెక్సాస్ లో అరుదైన మెదడు తినే అమీబా బారిన పడిన ఏడేళ్ల చిన్నారి బాలుడు మరణించాడు. దీనికి కారణం ఆర్లింగ్టన్ డాన్ మిసెన్ హైమర్ పార్క్ లోని నీటి నాణ్యత లోపమే నని .. ఈ విషయం తమ పరీక్షలో తేలిందని అధికారులు చెప్పారు.
మృతుడు పార్క్ లో ఆడుకుంటున్న సమయంలో అక్కడ ఉన్న నీరు బాలుడిపై పడిందని.. ఆ నీటిద్వారా అమీబా నెగ్లేరియా ఫోవ్‌లేరి సూక్ష్మ జీవి ఆ బాలుడి మెదడులోకి ప్రవేశించిందని వైద్యులు తెలిపారు. బాలుడు తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలతో ఇబ్బంది పడుతుంటే తల్లిదండ్రులు ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. పరీక్ష చేసిన వైద్య సిబ్బంది బాలుడి శరీరంలోకి బ్రేయిన్-ఈటింగ్ అమిబా ప్రవేశించినట్టు చెప్పారు. చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు. అయితే సెప్టెంబర్ 5న అరుదైన ఇన్ఫెక్షన్ కారణంగా పిల్లలు ఆసుపత్రిలో చేరినట్లు కూడా అధికారులు గుర్తించారు. వెంటనే ఆరోగ్య శాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నగరంలోని పబ్లిక్ స్ప్లాష్ ప్యాడ్‌లన్నింటినీ మూసివేశారు.
వ్యాధి నియంత్రణ అధికారులు పార్క్ నుంచి సేకరించిన నీటిలో అమీబా ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో కలుషితమైన నీరు ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తే.. అమీబా నెగ్లేరియా ఫోవ్‌లేరి సోకి.. మరణిస్తారని వైద్యులు చెబుతున్నారు. సురక్షితమైన నీటిలో ఉండాలని.. వేడి నీటిని తాగాలని సూచిస్తున్నారు. ఈ అమీబా నెగ్లేరియా ఫోవ్‌లేరి సూక్మజీవి సాధారణంగా కాల్వలు, చిన్ని చిన్న మురికి గుంటలు, అపరిశుభ్ర స్విమ్మింగ్ పూల్స్, తాగునీటి కుళాయిల వద్ద ఉంటాయి. తాజాగా చనిపోయిన పిల్లాడికి కూడా పార్క్ లోని నీటి ద్వారా సోకినట్లు తెలుస్తోంది. గార్డెన్ లో ఆడుకుంటుండగా స్ప్రింక్లర్ లోని నీరు బాలుడిపై పడి వ్యాధి వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ సూక్మజీవి ముక్కు ద్వారా శరీరంలోపలికి ప్రవేశించి నేరుగా మెదడుకు చేరుతుందని.. తర్వాత మెల్లగా తన ప్రభావం చూపిస్తుందని.. అమీబా నెగ్లేరియా ఫోవ్‌లేరి సోకినవారిలో తలనొప్పి, వాంతులు, అలసట వంటి లక్షణాలు ఉంటాయని చెబుతున్నారు. ఇది జాగ్రత్త తీసుకుంటే ప్రమాదకరమైంది కాదని కనుక వేడినీటి తాగాలని, పరిశుభ్రమైన నీటిని ఉపయోగించాలని సూచిస్తున్నారు.