Begin typing your search above and press return to search.
బ్రేకింగ్ :బోండా ఉమ , బుద్ధా వెంకన్న లపై దాడి..తీవ్ర గాయాలు
By: Tupaki Desk | 11 March 2020 9:00 AM GMTఏపీ లో స్థానిక సంస్థల ఎన్నికలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. తాజాగా టీడీపీ సీనియర్ నేతలైన బొండా ఉమ, బుద్దా వెంకన్న ఉన్న కారుపై దాడి జరిగింది. గుంటూరు జిల్లా మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ లో వీరిపై కొందరు వ్యక్తులు పెద్ద, పెద్ద కర్రల తో వారిపై దాడికి తెగబడ్డారు. అయితే , డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి వారికి ఎక్కువ దెబ్బలు తగలకుండా అక్కడినుండి తీసుకొని వెళ్ళాడు.
నిన్న బోదెలవీడు లో నామినేషన్ వేసేందుకు వచ్చిన టీడీపీ నేతలకు అడ్డుకున్నారు వైసీపీ నేతలు. ఆ అంశంపైనే నేతలతో మాట్లాడేందుకు వెళ్లారు బొండా ఉమ, బుద్దా వెంకన్న. ఈ సమయంలోనే. మొదట వారి కారుపై రాళ్ల దాడి జరిగింది. కారు ఆపకుండా అలాగే ముందుకు వెళ్లడంతో రింగ్ రోడ్ సెంటర్‌లో పెద్ద, పెద్ద కర్రల తో దాడి చేశారు. ఈ దాడిలో వారు ప్రయాణిస్తోన్న ఆడి కారు అద్దాలు పూర్తిగా మిగిలిపోయాయి. ఈ ఘటనలో బొండా ఉమ, బుద్దా వెంకన్నలకు గాయాలయ్యాయి. ఈ క్రమంలో డ్రైవర్ రింగు రోడ్డు నుంచి శ్రీశైలం రోడ్డువైపు వేగంగా కారును తీసుకెళ్లడం తో పెద్ద ప్రమాదం తప్పింది. టీడీపీ నేతలు వస్తారని ముందే తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు ఒక ప్రణాళిక ప్రకారం దాడులు చేశారని తెలుగుదేశం కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటన పై బోండా ఉమ మాట్లాడుతూ...మాచర్లలో తమపై వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ వెల్లడించారు. వైసీపీ కార్యకర్తలు తమ గన్‌మెన్‌పై కూడా దాడికి పాల్పడ్డారని వెల్లడించారు. వెల్దుర్తిలో డీఎస్పీ వాహనంలో వెళ్తుంటే మళ్లీ అడ్డుకున్నారని.. డీఎస్పీపై కూడా వైసీపీ కార్యకర్తలు దాడి చేశారన్నారు. పల్నాడులో పరిస్థితి భయానకంగా ఉందని... బతికి బయటకు వస్తామన్న నమ్మకం తమకు లేదన్నారు.