Begin typing your search above and press return to search.

క‌రోనా పేరుతో బ్రాండ్‌ లు.. వైర‌స్ రాక‌తో క‌నుమ‌రుగు

By:  Tupaki Desk   |   10 May 2020 2:30 AM GMT
క‌రోనా పేరుతో బ్రాండ్‌ లు.. వైర‌స్ రాక‌తో క‌నుమ‌రుగు
X
వాస్త‌వంగా కరోనా అంటే ఉర్దూలో గెలాక్సీ.. పాల‌పుంత అని అర్థం. కానీ ఇప్పుడు వ్యాపిస్తున్న వైరస్‌కు క‌రోనా అని పేరు పెట్టారు. ఒక్క‌సారిగా ఈ వైర‌స్ పేరు ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌ల‌వ‌రం రేపుతోంది. అయితే క‌రోనా అనే పేరు గ‌తంలో ఎప్పుడో ఉంది. ఉర్దూలో చాలా మంచి అర్థం ఉన్న ఈ పేరుతో ఎన్నో బ్రాండ్ ఉత్ప‌త్తులు ఉన్నాయని తెలుసా. బాటా క‌న్నా అత్యంత పాపుల‌ర్‌గా ఒక‌ప్పుడు క‌రోనా చెప్పులు ఉండేవి. పాత త‌రానికి క‌రోనా చెప్పులు బాగా తెలుసు. ఆ త‌ర్వాత ఆ బ్రాండ్ క‌నుమ‌రుగైంది. ఉత్త‌రప్ర‌దేశ్ రాష్ట్రం లక్నోకు 90 కిలో మీట‌ర్ల దూరంలో క‌రోనా పేరుతో ఓ గ్రామం ఉంది. అయితే ఆ గ్రామం మొన్న‌టివ‌ర‌కు ఎవ‌రికీ తెలియ‌దు. ఈ వైర‌స్ ప్ర‌భావంతో ఒక్క‌సారిగా దేశం దృష్టిలో ఆ గ్రామం పేరు తెలిసింది. మీడియా అంతా ఆ ఊరిపై ఫోక‌స్ పెట్టాయి.

వాస్త‌వంగా ఆ ఊరి పేరు స్పెల్లింగ్ (Korauna) వేరు. కానీ ప‌లికితే మాత్రం క‌రోనా అని వినిపిస్తోంది. ఆ విధంగా ఆస‌క్తిగా ఉంది.

ఇక గుజ‌రాత్‌లో ఓ హోట‌ల్ పేరు కూడా క‌రోనా అని ఉంది. ప్ర‌స్తుతం లాక్‌డౌన్‌తో ఆ హోట‌ల్ మూత‌ప‌డింది. కానీ వైర‌స్ రాక‌ముందు ఆ హోట‌ల్ నిత్యం ప్ర‌జ‌ల‌తో క‌ళ‌క‌ళ‌లాడేది. 2015లో గుజరాత్‌లోని సిద్ధాపూర్‌కు చెందిన బ‌ర్క‌త్ అనే వ్య‌క్తి రాజస్తాన్‌ సరిహద్దులో బనస్కాంత హైవే పక్కన క‌రోనా పేరుతో హోటల్ ప్రారంభించాడు. క‌రోనా అంటే ఉర్దూలో పాల‌పుంత‌, గెలాక్సీ అనే అర్థం ఉండ‌డంతో ఆ పేరు పెట్టిన‌ట్లు ఆ హోట‌ల్ య‌జ‌మాని బ‌ర్క‌త్ చెబుతున్నాడు. అయితే ఇప్పుడు ఆ మ‌హ‌మ్మారి వైర‌స్ పేరు కూడా క‌రోనా ఉండ‌డంతో ఈ హోట‌ల్‌ను అంద‌రూ ఆస‌క్తిగా గ‌మ‌నిస్తూ వెళ్తున్నారు. ప్ర‌స్తుతం మూసి ఉన్న హోట‌ల్‌ను చూస్తూ హైవే మీదుగా వెళుతున్న ప్ర‌యాణికులు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. మ‌రికొంద‌రు హోటల్‌ను వీడియో తీస్తూ, సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ సోషల్‌మీడియాలో పంచుకుంటున్నారు.

ఈ విధంగా కరోనా పేరిట హోటల్ ఉంద‌నే వార్త‌ను ప్ర‌జ‌లు ఆస‌క్తిగా చ‌దువుతున్నారు. క‌రోనా పేరుతో మ‌రికొన్ని దుకాణాలు, వ్యాపారాలు కొన‌సాగాయి. ప్ర‌స్తుతం అవ‌న్నీ ఈ వైర‌స్ పుణ్యాన ఆస‌క్తిగా మారాయి. క‌రోనా అంటే మ‌హ‌మ్మారి కాదు.. మంచి అర్థం ఉన్న ‌పేరు ఉంద‌ని ప్ర‌జ‌లు తెలుసుకుంటున్నారు.