Begin typing your search above and press return to search.
కళ్లలో పెట్టుకున్నాడు.. మంచి ఫ్యూచర్ ఇచ్చాడు.. కానీ, ఆమె భర్తను కిరాతకంగా చంపేసింది!
By: Tupaki Desk | 15 Nov 2022 12:30 AM GMTఇది.. ఎవరికీ అంతుచిక్కని ఉదంతం. ఒకవైపు.. భర్తలు తమను సరిగా చూడడం లేదని వాపోతున్న భార్యలు ఉన్న ఈ ప్రపంచంలో.. భార్యను కళ్లలో పెట్టుకుని చూసి... అందలం ఎక్కించిన భర్తను ఆ భార్య అత్యంత పాశవికంగా హతమార్చింది. మురికవాడలో పెరిగిన ఒక నిరుపేద మహిళను పెళ్లి చేసుకుని మంచి జీవితం ఇచ్చాడు. రాజకీయ నాయకురాలిగా ఎదిగేలా చేశాడు. అందుకు ప్రతిఫలంగా భర్తనే కడతేర్చేందుకు యత్నించి కటకటాల పాలయ్యింది. ఈ ఘటన బ్రెజిల్‌లో చోటు చేసుకుంది.
బ్రెజిలియన్ మాజీ కాంగ్రెస్ మహిళ ఫ్లోర్డెలిస్ డాస్ శాంటోస్ మురకివాడల్లో పెరిగింది. ఆమెను 1994లో పాస్టర్ ఆండర్సన్ డో కార్మో కలుసుకున్నాడు. ఆ తర్వాత ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ జంట మురికివాడల్లోని డజన్ల కొద్ది పిల్లలను దత్తత తీసుకుని ఎంతో ఆదర్శంగా నిలిచారు.
బ్రెజిల్‌లోని ఎవాంజెలికల్ క్రిస్టియన్ ఉద్యమంలో కూడా ఈ జంట మంచి పేరుతెచ్చుకున్నారు. అంతేగాదు శాంటోస్ 2018లో కన్జర్వేటివ్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ తరుఫున శాంటోస్ కాంగ్రెస్‌కు ఎన్నికయ్యింది కూడా. అయితే ఆర్ధిక వ్యవహారాల విషయాల్లో ఆమె భర్త డో కార్మో చాల కఠినంగా వ్యవహరించడం ఆమెకు నచ్చలేదు.
ఈ విషయమై ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. అదీగాక ఆమె ఎప్పుడైతే రాజకీయవేత్తగా ఎదగడం ప్రారంభమైందో అప్పటి నుంచి శాంటోస్ తన భర్తను హతమార్చేందుకు యత్నించింది. ఇలా ఆమె అతనిపై సుమారు 6 సార్లు విష ప్రయోగం చేసి హతమార్చేందుకు యత్నించింది. ఇక చివరికి తన బంధువు సాయంతో ఆయుధాన్ని కొనుగోలు చేసి మరీ 2019లో హతమార్చింది. దీన్ని సాయుధ దోపిడి హత్యగా చిత్రికరించేందుకు యత్నించింది. అయితే ఆ సమయంలో ఆమె పార్లమెంట్ సభ్యురాలుగా ఉండటంతో ఆమెను అదుపులోకి తీసుకోవడం, విచారించడం పోలీసులకు సాధ్యం కాలేదు.
ఆమె ఇటీవల 2021 పార్లమెంటరీ ఎన్నికల్లో ఓడిపోయి పదవిని కోల్పోవడంతో పోలీసులు ఈ కేసును చేధించారు. విచారణలో ఆమె తన కుటంబ సభ్యులు, పిల్లల సాయంతో తన భర్తను హతమార్చినట్లు తేలింది. దీంతో బ్రెజిల్ కోర్టు ఆమెకు 50 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఆమెకు ఈ హత్యలో సహకరించి తన కుమార్తెకి 30 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఈ హత్యలో ఆమెకు ఆయుధం కొనుగోలు చేసి సాయం అందించిన బంధువుకి కూడా ఏడాది జైలు శిక్ష విధించింది. ఈ ఘటనపై నెటిజన్లు రియాక్ట్ అయ్యారు. ``మంచి భర్త దొరకలేదని మేం బాధపడుతుంటే.. ఉన్న మంచి వాణ్ని ఎలా హత్య చేయాలనింపించిందే తల్లీ!`` అని కామెంట్లు చేస్తుండడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.