Begin typing your search above and press return to search.
వామ్మో అనిపించేలా రియో చీకటి కోణం
By: Tupaki Desk | 3 Aug 2016 5:07 AM GMTవిశ్వ క్రీడామహోత్సవం ఒలింపిక్స్ షురూ కావటానికి ఇంకా రెండు రోజులే మిగిలి ఉన్నాయి. ప్రపంచమంతా ఇప్పుడు బ్రెజిల్ వైపు ఆసక్తిగా చూస్తుంది. ఇదే చక్కటి సమయం అనుకున్నారేమో కానీ.. బ్రెజిల్లోని చీకటి కోణాల్ని.. ఏళ్ల తరబడి సాగుతున్నకొన్ని ఆరాచకాల్ని బయటకు తెచ్చేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ప్రపంచం మొత్తం బ్రెజిల్ ను చూసే వేళ.. ఆ దేశంలోని చీకటి కోణాల్నివెలుగులోకి తీసుకురావటం ద్వారా స్థానిక సర్కారు చిత్తశుద్ధితో ప్రయత్నించే వీలుందన్న భావన వ్యక్తమవుతోంది.
విశ్వ క్రీడలకు వేదికగా మారిన రియోకి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే అమ్మాయిల్ని లాటరీలు వేసి.. విజేతలకు ఇచ్చే దారుణమైన కోణం ఉందని.. పేదరికంతో ఇలాంటి దారుణలకు వారి తల్లిదండ్రులే పాల్పడతారని చెబుతున్నారు. ఒలింపిక్స్ వేదికకు కేవలం గంట ప్రయాణం దూరంలో ఉండే జాతీయ రహదారి బీఆర్-116గా వ్యవహరిస్తుంటారు. ఇక్కడ భారీగా ట్రక్కులు ఆగి ఉంటాయి. ఏదైనా ప్రమాదం జరిగిందా? అన్నట్లుగా కనిపిస్తుంటుంది. ఏమైందా? అని ఒక లుక్కేస్తే షాక్ తినాల్సిందే. అక్కడ అమ్మాయిల్ని వారి తల్లిదండ్రులే అమ్మకానికి పెడుతున్న వైనం కనిపిస్తుంటుంది.
లాటరీలు నిర్వహించి గెలుచుకున్న వారికి అమ్మాయిల్నిఇచ్చేయటం.. వస్తు మార్పిడి కింద తమ అవసరాలకు అమ్మాయిల్ని ఇచ్చేసే తీరు కనిపిస్తుంది. ఇదేమీ కొత్త విషయంకాదని.. చాలా పాత విషయంగా అక్కడి వారి చెబుతారు. జాతీయ రహదారి మీద ప్రయాణించే ట్రక్కు డ్రైవర్లు సమీప గ్రామాల్లోకి వెళ్లి.. చిన్న చిన్న పిల్లల్ని తమ లైంగిక వాంఛలు తీర్చుకోవటానికి వినియోగించటం కనిపిస్తుంది. పేదరికం.. ఆహారం కోసం ఆయా కుటుంబాలు ఈ దారుణానికి పాల్పడుతుంటారు. మరింత ఆరాచకమైన విషయం ఏమిటంటే.. తల్లిదండ్రులు ఆడపిల్లలకు చిన్నతనం నుంచే పోర్న్ వీడియోలు చూపిస్తుంటారు. ఇదెంత దారుణంగా ఉంటుందంటే.. తొమ్మిదేళ్ల వయసు నుంచే ఈ పాడు వీడియోలు చూపించి.. 12.. 13 ఏళ్లు వచ్చేసరికి సెక్స్ తో తీవ్ర ఆరోగ్యసమస్యలు తెచ్చుకునేలా పరిస్థితి ఉంటుంది.
ఇలాంటి సంస్కృతి ఉన్న చోట్ల ఆడపిల్లల్ని సెక్స్ కోసం కొనుగోలు చేసే గ్యాంగులు భారీగా తిరుగుతుంటాయి. చిన్న చిన్న పిల్లల్ని ఆహారం కోసం.. చిన్న చిన్న అవసరాల కోసం సొంతవాళ్లు ఆడపిల్లల్ని అమ్ముకోవటం కనిపిస్తుంది. ఈ ఆరాచకానికి ముగింపు పలకాలన్న ఉద్దేశంతో పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు ఈ విపరీతంపై పెద్ద ఎత్తున ప్రచారం తీసుకొస్తూ.. ప్రభుత్వం ఇలాంటి వాటికి కట్టడి చేసేలా ప్రయత్నాలు షురూ చేసింది. విశ్వక్రీడలకు వేదికగా మారేందుకు వేలాది కోట్లు ఖర్చు పెట్టిన బ్రెజిల్ సర్కారు.. అదేదో ఇలాంటి సామాజిక.. ఆర్థిక సమస్యలకు చెక్ పెట్టేందుకు వినియోగిస్తే బాగుండేది.