Begin typing your search above and press return to search.
కరోనా సోకినా వారు చనిపోరంట ...బ్రెజిల్ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు !
By: Tupaki Desk | 2 May 2020 2:30 AM GMTఅదేంటి కరోనా సోకితే చనిపోరా? మరి ప్రపంచ వ్యాప్తంగా 2 లక్షలకి పైగా ప్రజలు ఎలా చనిపోయారు అని ఆలోచిస్తున్నారా? ఇంతకీ కరోనా సోకినా వారు చనిపోరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆ మహానుభావుడు ఎవరు అంటే ? బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో. ఈయన తాజాగా ఫుట్ బాల్ లీగ్ గురించి మాట్లాడుతూ .." ఫుట్‌బాల్ ఆటగాళ్లకు కరోనా సోకినా.. వారు చనిపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే వారు అథ్లెట్లు. శారరీక దారుఢ్యం కలిగి ఉంటారు. కాబట్టి ఫుట్ బాల్ మ్యాచ్ లు నిర్వహించవచ్చు’’ అని బ్రెజిల్ అధ్యక్షుడు జేర్ బోల్సోనారో అనుచిత వ్యాఖ్యలు చేశారు.
నిరుద్యోగం కారణంగా ఎంతో మంది ఆటగాళ్లు కష్టాలు పడుతున్నారని.. వారిలో చాలా మంది తిరిగి క్రీడల్లో పాల్గొనేందుకు సుముఖంగా ఉన్నారని , కాగా కరోనా మహమ్మారి కట్టడి చర్యల్లో భాగంగా వివిధ దేశాల్లో లాక్ డౌన్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ఈవెంట్లు వాయిదా పడ్డాయి. ఇందులో భాగంగా బ్రెజిల్ లో నిర్వహించాల్సిన ఫుట్ బాల్ టోర్నమెంట్లను తాత్కాలికంగా వాయిదా వేశారు. మే ప్రారంభంలో బ్రెజీలియన్ చాంపియన్ షిప్ ప్రారంభం కావాల్సి ఉండగా ..అది కూడా కరోనా కారణంగా వాయిదా పడింది. దీన్ని పూర్తిగా రద్దు చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి .
ఈ క్రమంలో బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో గురువారం రేడియో గైబాతో మాట్లాడుతూ.. ప్రేక్షకులు లేకుండా స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహించే ప్రతిపాదనను పరిశీలించాల్సిందిగా తమ ఆరోగ్య శాఖా మంత్రి సూచించారని తెలిపారు. అదే విధంగా ఆటగాళ్లకు ఒకవేళ వైరస్ సోకినా వారి ప్రాణాలకు వచ్చిన ప్రమాదమేమీ లేదని వ్యాఖ్యానించారు. కాగా బ్రెజిల్ ఫుట్ బాల్ కాన్ఫెడరేషన్ పరిస్థితులు చక్కబడిన తర్వాతే మ్యాచ్ నిర్వహణ గురించి ఆలోచించాలంటూ.. ఆరోగ్య శాఖ సూచనలు కోరుతూ లేఖ రాసిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మొదటి నుంచి కరోనా ప్రభావాన్ని తక్కువగా అంచనా వేస్తూ.. ‘‘లిటిల్ ఫ్లూ ’’అంటూ బోల్సోనారో విమర్శల పాలవుతున్న విషయం తెలిసిందే.