Begin typing your search above and press return to search.

చైనా వ్యాక్సిన్ ఉత్త బోగ‌స్‌...క‌రోనా కంట్రోల్ చేయ‌లేదు

By:  Tupaki Desk   |   10 Nov 2020 5:57 PM GMT
చైనా వ్యాక్సిన్ ఉత్త బోగ‌స్‌...క‌రోనా కంట్రోల్ చేయ‌లేదు
X
ప్ర‌పంచానికి క‌రోనా వైర‌స్‌ను అంటించిన అప‌ప్ర‌ద‌ను మూట‌గ‌ట్టుకుంటున్న చైనా ఇప్పుడు ఇంకో నింద‌ను సైతం భ‌రించాల్సి వ‌స్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్‌ కోసం ఎదురు చూస్తున్న స‌మ‌యంలో తాము టీకా తెచ్చామ‌ని చెప్పుకొన్న ఈ డ్రాగ‌న్ కంట్రీకి ఆదిలోనే షాక్ త‌గిలింది. కరోనా వైరస్‌ నియంత్రించేందుకు వ్యాక్సిన్ ను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తోన్న చైనా వ్యాక్సిన్‌ సినోవాక్‌ కు సంబంధించి బ్రెజిల్‌లో జరుగుతున్న ప్రయోగాలకు ఆటంకం కలిగింది. వ్యాక్సిన్ వికటించడంతో ఆ ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు బ్రెజిల్‌ ఆరోగ్య శాఖ ప్రకటించింది.

కరోనా వైరస్‌ నియంత్రించేందుకు వ్యాక్సిన్ ను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తోన్న చైనా అవ‌కాశం ఉన్న అన్ని ప్రయత్నాలను చైనా కొనసాగిస్తోంది. ఎన్నో నియమాలను సడలించి మరీ వ్యాక్సిన్ ప్రయోగాలు చేస్తున్నారు. సినోవాక్ వ్యాక్సిన్ రూపొందించిన చైనా, బ్రెజిల్‌కు చెందిన బయోమెడికల్ పరిశోధనా సెంటర్ బుటాంటన్‌ ఇన్‌స్టిట్యూట్‌తో క‌లిసి ఆ దేశంలో వ్యాక్సిన్ ప్రయోగాలు నిర్వ‌హిస్తోంది. బ్రెజిల్‌లో జ‌రుగుతున్న ఈ ప్ర‌యోగాల్లో సానుకూల ఫలితాలు వచ్చినట్టు గత నెలలో బుటాంటాన్ ప్రకటన కూడా చేసింది. అయితే, ఇంతలోనే ఆ వ్యాక్సిన్ వికటించింది. వ్యాక్సిన్ తీసుకున్న కొందరు అనారోగ్యానికి గురయ్యారు. అయితే, ఈ ప్రయోగాలకు స‌మ‌న్వ‌యం వ‌హిస్తున్న బ్రెజిల్ లోని సినోవాక్‌ బయోటెక్‌ లిమిటెడ్‌ సంస్థ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు.

ఇదిలాఉండ‌గా, మ‌రిన్ని ఆందోళ‌న‌క‌ర వార్తలు వెలుగులోకి వ‌స్తున్నాయి. చైనాతో పాటు పలు దేశాల వ్యాక్సిన్లు వికటిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఆస్ట్రాజెనెకా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వంటి వ్యాక్సిన్ల ప్రయోగాలు చివరి దశకు చేరుకున్న సమయంలో వికటించాయి. ఈ నేప‌థ్యంలో భార‌త్‌లో జ‌రుగుతున్న ప‌రిశోధ‌న‌ల‌పై అంద‌రి చూపు ప‌డింది.