Begin typing your search above and press return to search.
వ్యాక్సిన్ వద్దంటున్న బ్రెజిల్.. ఇంత జరిగినా ఇంకా బుద్ధిరాలేదా?
By: Tupaki Desk | 10 Dec 2020 11:30 PM GMTకరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచదేశాలన్నీ ఆతృతతో ఎదురుచూస్తున్న వేళ.. బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సోనారో మాత్రం భిన్నమైన వాదనలు చేస్తున్నాడు. ‘ నేను వ్యాక్సిన్ తీసుకోనూ’ అంటూ ఆయన ఇటీవల అన్నాడు. ఈ మాటలు సోషల్‌మీడియాలో పెద్ద దుమారమే రేపాయి. కరోనా పై బోల్సోనారో తరచూ వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. మాస్క్ పెట్టుకోవద్దంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘ప్రజలకు ఇష్టం లేకపోతే మాస్కులు పెట్టుకోవద్దు. వాళ్లను బలవంతం చేయలేం’ అని ఆయన అన్నాడు. అయితే తాజాగా వ్యాక్సిన్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
బ్రెజిల్ ప్రజలు వ్యాక్సిన్లకు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. స్మాల్ఫాక్స్ వాక్సిన్ ప్రతిఒక్కరూ తప్పనిసరిగా వేయించుకోవాలని 1904 నవంబర్ నెలలో బ్రెజిల్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. తాము వ్యాక్సిన్ వేసుకోబోమంటూ ప్రభుత్వంతో తగాదాకు దిగారు. ఈ సమయంలో అనేక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అయితే ఇందుకు కారణం అప్పట్లో టీకాలు ఇచ్చే సిరంజీలు చాలా పెద్దవిగా ఉండేవి. టీకా తీయుంచుకున్న దగ్గర విపరీతంగా గాయం అయ్యేది. చాలా రోజులపాటు ఆ గాయం అలాగే ఉండిపోయేది. కొందరిలో గాయం పుండుగా మారి చాలానెలలకు తగ్గేది.
ఇప్పటికీ చాలా మంది కి ఈ టీకాలకు సంబంధించిన మచ్చలు ఉంటాయి. బ్రెజిల్లో టీకా పంపిణీ సరిగ్గా జరగకపోవడంతో 1904లో మశూచి కారణంగా రియో నగరంలో 0.4 శాతం మంది చనిపోయారు. అప్పట్లో అక్కడి ప్రజలకు పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగేది. చివరకు బ్రెజిల్ ప్రభుత్వం అన్ని అంటురోగాల వ్యాక్సిన్లను తప్పనిసరి చేసింది. ఆ విషయమై ప్రజల్లో చైతన్యం తీసుకరావడానికి ఎంతో ప్రచారం చేసింది. దీంతో 1990 దశకంలో 95 శాతం దేశ ప్రజలు స్వచ్ఛందంగా టీకాలు వేయించుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం బ్రెజిల్ అధ్యక్షుడు ఇలా మాట్లాడం తీవ్ర గందరగోళాన్ని సృష్టించింది.