Begin typing your search above and press return to search.
లాక్‌డౌన్ ఎఫెక్ట్ ...బ్రెజిల్ లో ట్రెండ్ అవుతోన్న 'డ్రై థ్రూ' వివాహం
By: Tupaki Desk | 30 May 2020 11:30 PM GMTపెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కీలకమైంది. జీవితంలో ఒకేఒకసారి జరిగే అతి పెద్ద వేడుక. కాబట్టి ఆ వివాహ వేడుక కోసం ఎన్నో కళలు కంటుంటారు. దాని కోసం ఎంత ఖర్చు అయినా చేస్తారు.. ఎక్కడికైనా వెళ్తారు. ఇప్పటి వరకు మనం డెస్టినేషన్ వెడ్డింగ్, గాల్లో, నీటిలో జరిగిన వివాహ వేడుకలను చూశాం. కానీ , ఇప్పుడు బ్రెజిల్ లో మరో కొత్త రకమైన వివాహ వేడుక ట్రెండ్ అవుతుంది. అదే 'డ్రైవ్ థ్రూ' ..ఈ నయా ట్రెండ్ బ్రెజిల్ లో ఇప్పుడిప్పుడే బాగా పాపులర్ అవుతుంది.
బ్రెజిల్‌కు చెందిన జోవా బ్లాంక్, ఎరికా బ్లాంక్ ఈ డ్రై థ్రూ వివాహం చేసుకున్నారు. ఈ వేడుక ఐదు నిమిషాల పాటు జరుగుతుంది. కార్లో వచ్చిన జంటలు తమ ప్రమాణాలను చదివి, ఉంగరాలను మార్పిడి చేసుకుంటారు. తర్వాత మాస్క్ మీదుగానే ముద్దు పెట్టుకుంటారు. దాంతో వారి వివాహం పూర్తయినట్లే. వెంటనే అధికారులు వారికి మ్యారేజ్ సర్టిఫికెట్ ఇస్తారు. తర్వాత ఆ కారు వెళ్లి పోతుంది. మరో కారు మరో జంటతో వస్తుంది.
ఈ సందర్భంగా ఎరికా మాట్లాడుతూ.. ‘పెళ్లి చేసుకోవాలని వారం క్రితం అనుకున్నాము. ఈ డ్రైవ్ థ్రూ వివాహ వేడుక గురించి తెలుసుకున్నాము. ఈ పద్దతి మాకు చాలా నచ్చింది. కొత్త పద్దతిలో వివాహం చేసుకోవడం చాలా బాగుంది. సంతోషంగా కూడా ఉంది అన్నారు. వైరస్ కారణంగా బ్రెజిల్ లో లాక్ డౌన్ విధించింది. ప్రస్తుతం అక్కడ లాక్ డౌన్ అమలవుతోంది. దాంతో ఆ దేశ యువత ఈ డ్రైవ్ థ్రూ వివాహ వేడుకవైపు ఆకర్షితులవుతున్నారు. కొన్ని చోట్ల వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా వివాహ వేడుకలు జరుగుతుండగా..మరికొన్ని చోట్ల ఇలా డ్రైవ్ థ్రూ పద్దతిలో వివాహాలు జరుగుతున్నాయి.