Begin typing your search above and press return to search.
ఏపీ బడ్జెట్ సమావేశాలకు బ్రేక్
By: Tupaki Desk | 18 March 2021 2:36 AM GMTఏపీ బడ్జెట్ సమావేశాలు వాయిదా వేయబోతున్నట్టు సమాచారం. నిజానికి మార్చి 19 నుంచి బడ్జెట్ సమావేశాలు జరగాల్సి ఉంది. కానీ ఇంతలోనే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో బడ్జెట్ సమావేశాలకు బ్రేక్ పడింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉండటంతో బడ్జెట్ సమావేశాలు వాయిదా వేయాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. తిరుపతి పార్లమెంట్ సీటుకు ఉప ఎన్నికల నేపథ్యంలో మార్చి 23 నుంచి మే 2 వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రానున్నది. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలను వాయిదా వేయాలని సీఎం జగన్ నిర్ణయించారు.
ఈ మేరకు బుధవారం సీఎం .. స్పీకర్ తమ్మినేని సీతారాం , కౌన్సిల్ చైర్మన్ ఎంఏ షరీఫ్, ఉన్నతాధికారులతో సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం పరిపాలనా రాజధానికి విశాఖపట్టణాన్ని చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. మరోవైపు తిరుపతి పార్లమెంట్‌కు వైసీసీ అభ్యర్థి గా ప్రముఖ ఫిజియోథెరపీ డాక్టర్ గురుమూర్తిని ఖరారు చేసిన విషయం తెలిసిందే.
గురువారం ఆయన తాడేపల్లిలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ని కలుసుకున్నారు. తనకు అవకాశం ఇచ్చినందుకు ఆయన సీఎం జగన్మోహన్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గురుమూర్తి సీఎం జగన్ కుటుంబానికి ఎంతో సన్నిహితుడు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ పాదయాత్ర చేసినప్పుడు గురుమూర్తి ఆయన వెంటే ఉన్నారు. సీఎం జగన్ ఆరోగ్య పరమైన సలహాలు సూచనలు అందించారు. దీంతో ఆయనకు ప్రస్తుతం ఈ అవకాశం దక్కింది.