Begin typing your search above and press return to search.
షాకింగ్: భారత్ జోడో యాత్రకు బ్రేక్.. ఢిల్లీకి రాహుల్ గాంధీ
By: Tupaki Desk | 23 Oct 2022 9:37 AM GMTకన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ చేపట్టిన రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రకు బ్రేక్ పడింది. అర్ధాంతరంగా యాత్రను ఆపేసి ఢిల్లీకి పయనమయ్యారు రాహుల్ గాంధీ. ప్రస్తుతం ఏపీ నుంచి భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించింది. రాష్ట్రంలో తొలిరోజు 4 కి.మీల పాదయాత్రతో ముగించారు రాహుల్. ఈనెల 26వ తేదీ వరకూ జోడోయాత్రకు విరామం ప్రకటించారు. అనంతరం అక్కడి నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకొని ఢిల్లీకి పయనమయ్యారు.
రాహుల్ గాంధీ తెలంగాణలోకి ప్రవేశించాక 4 కి.మీలు నడిచి దీపావళి సెలవు తీసుకున్నారు. ఈనెల 27న రాహుల్ పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా భారత్ జోడో యాత్రను ఏ శక్తి ఆపలేదని రాహుల్ గాంధీ అన్నారు. దేశ సమైక్యత కోసమే భారత్ జోడో యాత్ర చేపట్టినట్టు స్పష్టం చేసింది. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
దీపావళిని కుటుంబ సభబ్యులతో జరుపుకునేందుకు రాహుల్ గాంధీ ఢిల్లీకి బయలు దేరినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈనెల 24,25,26 తేదీల్లో పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఈనెల 26న ఏఐసీసీ చీఫ్ గా మల్లి కార్జున ఖర్గే ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి మక్తల్ చేరుకుంటారు.
ఏపీలో ముగిసిన అనంతరం తెలంగాణలోకి రాహుల్ ఎంట్రీఇచ్చాడు. తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ వద్ద కృష్ణా నది బ్రిడ్జి మీదుగా రాస్ట్రంలో రాహుల్ పాదయాత్ర ప్రారంభమైంది. నవంబర్ 8వ తేదీ వరకూ ఇది కొనసాగుతుంది.
తెలంగాణలో రాహుల్ గాంధీ మొత్తం 370 కిలోమీటర్లు యాత్ర చేపట్టనున్నారు. ఈ మేరకు రూట్ మ్యాప్ ఖరారైంది. తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ దగ్గర కృష్ణా నది బ్రిడ్జి మీదుగా రాష్ట్రంలో మొదలయ్యే యాత్ర నేడు 13 కిలోమీటర్లు మేర సాగనుంది.
మరిక్కల్ వద్ద తెలంగాణలో తొలి రోజు యాత్రలో భాగంగా రాహుల్ ప్రసంగానికి ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత శంషాబాద్ నుంచి ఢిల్లీ వెళతారు. దీపావళి కావడంతో మూడు రోజుల పాటు యాత్రకు విరామం ప్రకటించారు. 26వ తేదీన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గే ప్రమాణ స్వీకారం తర్వాత రాహుల్ గాంధీ తిరిగి తెలంగాణకు వస్తారు. 27వ తేదీ ఉదయం నుంచి తెలంగాణలో తిరిగి యాత్ర కొనసాగుతోంది.