Begin typing your search above and press return to search.

సానియాతో బ్రేక‌ప్! అయినా షోయ‌బ్ ఇలా షాకిచ్చాడు!!

By:  Tupaki Desk   |   15 Nov 2022 4:30 AM GMT
సానియాతో బ్రేక‌ప్! అయినా షోయ‌బ్ ఇలా షాకిచ్చాడు!!
X
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా త‌న భ‌ర్త.. పాకిస్తానీ క్రికెట‌ర్ షోయ‌బ్ మాలిక్ నుంచి విడిపోతోంద‌ని క‌థ‌నాలు సంచ‌ల‌నంగా మారిన‌ సంగ‌తి తెలిసిందే. ఈ జంట మ‌ధ్య క‌ల‌త‌ల‌కు కార‌ణం షోయ‌బ్ ప్ర‌ముఖ మోడ‌ల్ తో సంబంధం కొన‌సాగించ‌డ‌మేన‌ని కూడా ప్ర‌చారం సాగిపోయింది. స‌ద‌రు మోడ‌ల్ కం న‌టిని చంపేస్తానంటూ సానియా వార్నింగ్ ఇచ్చింద‌ని ప్ర‌స్తుతం త‌న పిల్ల‌లతో క‌లిసి షోయ‌బ్ కి దూరంగా నివ‌శిస్తోంద‌ని కూడా గుస‌గుస‌లు స్ప్రెడ్ అయ్యాయి. పెళ్లి త‌ర్వాత దుబాయ్ లో సెటిలైన ఈ జంట అన్యోన్య‌త‌పై ఎలాంటి సందేహాలు లేని అభిమానులు ఇటీవ‌లి వ‌రుస మీడియా క‌థ‌నాల‌తో ఒక్క‌సారిగా కల‌త‌కు గుర‌య్యారు. ఈ అంద‌మైన జంట విడిపోకూడ‌ద‌ని దేవుడిని ప్రార్థించారు. సోష‌ల్ మీడియాల్లో బోలెడంత సానుభూతి విచారం వ్య‌క్త‌మైంది.

అయితే అదంతా వ‌ట్టి ట్రాష్‌.. ప‌బ్లిసిటీ స్టంట్!! అని తెలియ‌గానే చాలా మంది అభిమానులు ఈ జంట క‌న్నింగ్ ట్రిక్కుపై భ‌గ్గుమ‌న్నారు. ఓ టీవీ రియాలిటీ షో ప్ర‌మోష‌న్ కోసం స‌ద‌రు సెల‌బ్రిటీ క‌పుల్ ఇలా ఛీప్ ప‌బ్లిసిటీకి తెర తీసార‌ని షోని విజ‌య‌వంతం చేయ‌డం కోసం ఇలా నాట‌కాలాడార‌ని క‌థనాలు వేడెక్కించాయి.

ఇంత‌లోనే మాలిక్ నుంచి మ‌రో ట్విస్టు. త‌న భార్య సానియా మీర్జా పుట్టినరోజు సందర్భంగా త‌న‌ కోసం ఒక మధురమైన సందేశాన్ని పంపాడు. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా నేటితో 36 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ ప్రత్యేకమైన రోజున భార్య కోసం ఇన్ స్టాలో ఒక ప్రత్యేక సందేశం పంపడం ద్వారా బ్రేక‌ప్ పుకార్ల‌కు చెక్ పెట్టాడు. ఈ అంద‌మైన జంట పై పుకార్ల న‌డుమ‌ ఈ పరిణామం ప్రాముఖ్యతను సంతరించుకుంది.

సానియా మీర్జా- షోయబ్ మాలిక్ ఏప్రిల్ 2010లో వివాహం చేసుకున్నారు. ఈ జంట తమ కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్ ను 2018లో స్వాగతించారు. కానీ ఆ త‌ర్వాత వీరి మ‌ధ్య క‌ల‌త‌లపై మీడియాలో విస్త్ర‌తంగా ప్ర‌చారం సాగింది. అటు పాకిస్తానీ మీడియా ఇటు ఇండియాలో జాతీయ మీడియా ర‌క‌ర‌కాల క‌థ‌నాల‌తో ప్ర‌చారం ఊద‌ర‌గొట్టాయి.

కానీ ఇంత‌లోనే సానియా మీర్జా పుట్టినరోజు సందర్భంగా షోయబ్ మాలిక్ తన ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ తో ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. "మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు @మీర్జా సానియా. చాలా ఆరోగ్యకరమైన సంతోషకరమైన జీవితాన్ని కోరుకుంటున్నారు! ఈ రోజును పూర్తిగా ఆస్వాధించండి…" అని విషెస్ అందించారు. ఇదిలా ఉండగా ఈ పరిణామంపై సానియా మీర్జా ఇంకా స్పందించలేదు.

గ‌త ఆదివారం 13 నవంబర్ OTT ప్లాట్ ఫారమ్ ఉర్దూఫ్లిక్స్ ఒక సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. సానియా- షోయబ్ మాలిక్ జంట‌ రియాలిటీ షో 'ది మీర్జా మాలిక్ షో'లో కలిసి కనిపిస్తారని ప్రకటించింది. "ది మిర్జా మాలిక్ షో అతి త్వరలో ఉర్దూఫ్లిక్స్‌లో మాత్రమే" అని వ్యాఖ్య‌ను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. షోయబ్ భుజంపై చేయి వేసి సానియా చిరున‌వ్వులు చిందిస‌తూ ఫోజులిచ్చిన పోస్ట‌ర్ ని రివీల్ చేసింది. ఇది చూడ‌గానే ఇదంతా ప‌బ్లిసిటీ స్టంట్ కోస‌మేనా? కొద్ది రోజులుగా విడిపోతున్నార‌ని సాగిన ప్ర‌చార‌మంతా స‌ద‌రు చానెల్ టీఆర్పీల కోస‌మేనా? అంటూ ఒక‌టే సోష‌ల్ మీడియాలో గ‌గ్గోలు మొలైంది. ఈ జంట ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారు. అయితే ఈ పరిణామంపై సానియా- షోయబ్ ఇంకా స్పందించలేదు.

పాక్ న‌టి కారణంగా బ్రేక‌ప్ సానియా మీర్జా -షోయబ్ మాలిక్ విడిపోవడానికి అసలు కారణం మోడల్ అయేషా ఒమర్ అని కూడా కొన్ని వార్తా క‌థ‌నాలు పేర్కొంటున్నాయి. ఆయేషా ఒమర్ అనే ప్రముఖ పాకిస్థానీ నటి కం మోడల్ తో పాక్ క్రికెటర్ షోయ‌బ్ చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నార‌ని .. భారత టెన్నిస్ స్టార్ సానియాను మోసం చేశాడని ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ప‌ర్ఫెక్ట్ సెల‌బ్రిటీ క‌పుల్ భవిష్యత్తు ఏమిటో కాలమే చెబుతుంది. నేటి బ‌ర్త్ డే బేబి.. టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు పుట్టినరోజు శుభాకాంక్షలు!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.